Former CM: మాజీ సీఎం అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారో తెలిస్తే..
ABN , First Publish Date - 2023-04-30T12:41:32+05:30 IST
మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ...
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీకి మతిభ్రమించిందని, వెంటనే అతనికి వైద్యపరీక్షలు జరిపించాల్సిన అవసరం ఉందని బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప(Former Chief Minister Yeddyurappa) మండిపడ్డారు. కలబురిగిలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీకి 40 సీట్లు మాత్రమే వస్తాయంటూ చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ గెలుపును ఎవరూ అడ్డుకోలేరన్నారు. 130 స్థానా ల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసేది తామే అన్నారు. రాహుల్‌గాంధీ నోటికొచ్చినట్లు మాట్లాడతారన్నారు. దీనిని బట్టి రాహుల్‌కు ఉన్న రాజకీయ పరిణితి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు అన్నారు. బీజేపీలో లింగాయతలను నిర్లక్ష్యం చేస్తున్నారనే జగదీష్‌శెట్టర్(agdish Shetter) ఆరోపణలను తిప్పికొట్టారు. ఇంతకూ బీజేపీలో లింగాయతలను అంతగా నిర్లక్ష్యం చేసి ఉంటే రెండున్నర దశాబ్దాల పాటు ఎందు కు కొనసాగి ఉన్నత పదవులు అనుభవించినట్లో అం టూ మండిపడ్డారు. కొరటగెరెలో కాంగ్రెస్ అభ్యర్థి పరమేశ్వర్‌పై రాళ్లదాడి దుర్మార్గమైనదన్నారు. ఇటువంటి సంఘటనలు కొనసాగరాదన్నారు. సమగ్ర విచారణలు జరిపించి తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. బసనగౌడ పాటిల్ యత్నాళ్ కాంగ్రె్‌సనేత సోనియాగాంధీని విషకన్యతో పోల్చడాన్ని తప్పుపట్టారు. ఇటువంటి చౌకబారు వ్యాఖ్యలు ఎవరూ చేయరాదన్నారు.