BJP: బీజేపీ ఎంపీకి తృటిలో తప్పిన ప్రమాదం
ABN , First Publish Date - 2023-02-20T21:55:02+05:30 IST
బీజేపీ రాజ్యసభ ఎంపీ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
చండీగఢ్: త్రిపుర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ రాజ్యసభ ఎంపీ విప్లవ్ దేవ్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఢిల్లీ నుంచి చండీగఢ్ వెళ్తుండగా హర్యానాలోని పానిపట్‌లో జీటీ రోడ్‌పై ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. డ్రైవర్ కూర్చునే వైపు పూర్తిగా నుజ్జయింది. ఘటనలో విప్లవ్ దేవ్ తృటిలో తప్పించుకున్నారని ఆయన కార్యాలయం తెలియజేసింది. ప్రమాదంలో ఎవ్వరూ గాయపడలేదని సమల్క డిప్యూటీ ఎస్పీ ఓం ప్రకాశ్ తెలిపారు. జీటీ రోడ్‌పై పంక్చరై అప్పటికే నిల్చి ఉన్న కారును విప్లవ్ దేవ్ ప్రయాణిస్తున్న కారు ఢీ కొట్టింది.