India Deploys Warships: అరేబియా సముద్రంలో మూడు యుద్ధనౌకలను మోహరించిన భారత నేవీ
ABN , Publish Date - Dec 26 , 2023 | 01:01 PM
అరేబియా సముద్రంలో వాణిజ్య నౌక ‘ఎంవీ కెమ్ ప్లూటో’పై డ్రోన్ దాడి నేపథ్యంలో భారత నేవీ కీలక చర్యకు ఉపక్రమించింది. అరేబియా సముద్రంలో మూడు యుద్ధ నౌకలను మోహరించింది. అంతేకాకుండా సముద్ర గస్తీ కోసం పీ-8ఐ లాంగ్-రేంజ్ పెట్రోల్ విమానాన్ని విమానాన్ని కూడా రంగంలోకి దించింది. యుద్ధనౌకలు ఐఎన్‌ఎస్ మోర్ముగావ్, ఐఎన్ఎస్ కొచ్చి, ఐఎన్ఎస్ కోల్‌కతాలను మోహరించామని నేవీ అధికారిక ప్రకటన విడుదల చేశారు.
న్యూఢిల్లీ: అరేబియా సముద్రంలో వాణిజ్య నౌక ‘ఎంవీ కెమ్ ప్లూటో’పై డ్రోన్ దాడి నేపథ్యంలో భారత నేవీ కీలక చర్యకు ఉపక్రమించింది. అరేబియా సముద్రంలో మూడు యుద్ధ నౌకలను మోహరించింది. అంతేకాకుండా సముద్ర గస్తీ కోసం పీ-8ఐ లాంగ్-రేంజ్ పెట్రోల్ విమానాన్ని విమానాన్ని కూడా రంగంలోకి దించింది. యుద్ధనౌకలు ఐఎన్‌ఎస్ మోర్ముగావ్, ఐఎన్ఎస్ కొచ్చి, ఐఎన్ఎస్ కోల్‌కతాలను మోహరించామని నేవీ అధికారిక ప్రకటన విడుదల చేశారు. సముద్రంలో నౌకలపై వరుస దాడుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
కాగా అరేబియా నుంచి ఇంధనతో మంగళూరు బయలుదేరిన వాణిజ్య నౌక ‘ఎంవీ కెమ్ ప్లూటో’పై శనివారం డ్రోన్ దాడి జరిగింది. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినప్పటికీ తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఆ నౌక ప్రస్తుతం ముంబై హార్బర్‌కు చేరుకుంది.