Share News

Narendra Modi: 2040 నాటికి చంద్రుడి పైకి తొలి ఇండియన్ ... గగన్‌యాన్ మిషన్‌పై మోదీ సమీక్ష

ABN , First Publish Date - 2023-10-17T15:49:02+05:30 IST

2040 నాటికి చంద్రుడి పైకి తొలి భారతీయుడిని పంపాలనే లక్ష్యాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శాస్త్రవేత్తల ముందుంచారు. 2035 నాటికి భారత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. భారతదేశ గగన్‌యాన్ మిషన్ ప్రగతిని ఉన్నత స్థాయి అధికారుల సమావేశంలో ప్రధాని మంగళవారంనాడు సమీక్షించారు.

Narendra Modi: 2040 నాటికి చంద్రుడి పైకి తొలి ఇండియన్ ... గగన్‌యాన్ మిషన్‌పై మోదీ సమీక్ష

న్యూఢిల్లీ: 2040 నాటికి చంద్రుడి (Moon) పైకి తొలి భారతీయుడిని (First Indian) పంపాలనే లక్ష్యాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) శాస్త్రవేత్తల ముందుంచారు. 2035 నాటికి భారత అంతరిక్ష కేంద్రాన్ని (Space station) ఏర్పాటు చేయాలని సూచించారు. వీనస్ ఆర్బిటర్ మిషన్, మార్స్ ల్యాండర్‌తో కూడిన ఇంటర్ ప్లానెటరీ మిషన్ల కోసం కృషి చేయాలని శాస్త్రవేత్తలను కోరారు. భారతదేశ గగన్‌యాన్ మిషన్ ప్రగతిని ఉన్నత స్థాయి అధికారుల సమావేశంలో ప్రధాని మంగళవారంనాడు సమీక్షించారు. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజైషన్ (ఇస్రో) చైర్మన్ సి.సోమనాథ్, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.


హ్యూమన్ రేటెడ్ ప్రయోగ వాహనాలతో పాటు (హెచ్ఎల్‌వీఎం3), 20 ప్రధాన పరీక్షల గురించి ఈ సమావేశంలో ప్రధాని చర్చించారు. క్రూ ఎస్కేప్ సిస్టం టెస్ట్ వెహికల్‌ తొలి ప్రదర్శనను ఈనెల 21న షెడ్యూల్ చేయగా, 2025లో గగన్ యాన్ ప్రయోగం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. చంద్రయాన్, ఆదిత్య-1 అంతరిక్ష ప్రయోగాలు విజయవంతమైన క్రమంలో భవిష్యత్తులో మరిన్ని ప్రతిష్ఠాత్మక లక్ష్యాలతో ముందుకు వెళ్లాలని శాస్త్రవేత్తలకు ప్రధాని సూచించారు. ఇందులో భాగంగా 2040 నాటికి చంద్రుడిపైకి తొలి భారతీయుడిని పంపాలని, 2035 నాటికల్లా భారత అంతరిక్ష కేంద్ర ఏర్పాటు కావాలని వారికి సూచించారు.


అక్టోబర్ 21న టీవీ-డి1 టెస్ట్ ఫ్లైట్

కాగా, టీవీ-డి1 టెస్ట్ ఫ్లైట్‌ ఆక్టోబర్ 21వ తేదీ ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య షెడ్యూల్ చేసినట్టు ఇస్రో ఒక ట్వీట్‌లో తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో దీనిని షెడ్యూల్ చేశారు. వచ్చే ఏడాది చివర్లో మానవ అంతరిక్షయానంలో భారతీయ వ్యోమగాములను ఉంచడానికి షెడ్యూల్ చేసిన సిబ్బంది మాడ్యూల్‌ను పరీక్షించడానికి ఇది సహాయపడుతుంది. టీవీ-డి1 టెస్ట్ ఫ్లైట్ తరువాత మరో మూడు టెస్ట్ వెహికల్ మిషన్‌లను నిర్వహిస్తామని ఎస్.సోమనాథ్ తెలిపారు.

Updated Date - 2023-10-17T17:50:33+05:30 IST