NIA: చెన్నైలో 8 చోట్ల ఎన్‌ఐఏ తనిఖీలు
ABN , First Publish Date - 2023-04-07T22:52:26+05:30 IST
తమిళనాడు రాజధాని చెన్నై(Chennai)లో నివసిస్తున్న ఉగ్రవాద సంస్థల సానుభూతిపరుల నివాస గృహాలు, సంస్థలలో జాతీయ దర్యాప్తు బృందం (NIA) అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై(Chennai)లో నివసిస్తున్న ఉగ్రవాద సంస్థల సానుభూతిపరుల నివాస గృహాలు, సంస్థలలో జాతీయ దర్యాప్తు బృందం (NIA) అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
మొత్తం 8 ప్రాంతాల్లో తనిఖీలు జరిపి, రూ.1 కోటి నగదు, 300 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. పోరూర్‌కు చెందిన అయ్యప్పన్, కుండ్రత్తూరుకు చెందిన ఫ్లారెన్స్, కోవూర్‌కు చెందిన సురేష్‌కుమార్, పమ్మల్ ప్రాంతానికి చెందిన యేసుదాస్ నివాసగృహాలు, మన్నడి ప్రాంతంలో యాపిల్ ప్యాలెస్, ఆరంజ్ ప్యాలెస్, గ్రీన్ ప్యాలెస్ లాడ్జీలు, ప్యారీస్, ఈవినింగ్ బజార్ ప్రాంతాల్లో ఉన్న దుకాణాల్లో ఈ తనిఖీలు నిర్వహించారు. దీనికి సంబంధించి ఎన్‌ఐఏ అధికారులు ప్రకటన విడుదల చేశారు.