Tomato: గణనీయంగా తగ్గిన టమోటాల విక్రయం
ABN , First Publish Date - 2023-07-06T07:38:00+05:30 IST
స్థానిక కోయంబేడు మార్కెట్(Koyambedu Market)లో టమోటాల విక్రయం బాగా తగ్గిపోయింది. ప్రస్తుతం టమోటాల ధర కిలో సెంచరీ దాటిపోయింది. ఈ ధ
అడయార్(చెన్నై): స్థానిక కోయంబేడు మార్కెట్(Koyambedu Market)లో టమోటాల విక్రయం బాగా తగ్గిపోయింది. ప్రస్తుతం టమోటాల ధర కిలో సెంచరీ దాటిపోయింది. ఈ ధరాభారం నుంచి కొంతమేరకు ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టి... రేషన్ షాపుల్లో కిలో టమోటాలను రూ.60కే విక్రయిస్తున్నారు. అయితే, టమోటాల ధర చాలా ఎక్కువగా ఉండటంతో గృహిణిలు కూడా కూరల్లో వాటిని తక్కువగా ఉపయోగిస్తున్నారు. అదే సమయంలో కోయంబేడు మార్కెట్‌లో టమోటా(Tomato)లను కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా తగ్గింది. ఒక వేళ కొనుగోలు చేసినా కేవలం 250 గ్రాములు లేదా 500 గ్రాములు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఎవరు కూడా కిలోల్లో కొనుగోలు చేయడం లేదు. దీంతో టమోటాల విక్రయం గణనీయంగా తగ్గిపోయింది. ప్రస్తుతం ఈ మార్కెట్‌లో చిల్లరగా కిలో టమోటా రూ.110 చొప్పున విక్రస్తున్నారు.