Veera Vanita : యుద్ధరంగాన తొలిసారి వీర వనిత
ABN , First Publish Date - 2023-03-08T02:36:46+05:30 IST
: భారతావనిలో ఓ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. మహిళా దినోత్సవ వేడుకలకు సరిగ్గా ఒక్కరోజు ముందు భారత వైమానిక దళం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందెన్నడూ లేని విధంగా ఓ మహిళకు

వాయుసేనలో ఫ్రంట్‌లైన్ కాంబాట్ యూనిట్
నాయకురాలిగా కెప్టెన్ షాలిజా ధామి
న్యూఢిల్లీ, మార్చి 7: భారతావనిలో ఓ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. మహిళా దినోత్సవ వేడుకలకు సరిగ్గా ఒక్కరోజు ముందు భారత వైమానిక దళం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందెన్నడూ లేని విధంగా ఓ మహిళకు యుద్ధక్షేత్రాన నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. ఫ్లైట్ కమాండర్‌గా బాధ్యతలు తీసుకున్న తొలి మహిళగా నిలిచిన ‘షాలిజా ధామి’నే అందుకు ఎంపిక చేసింది. ఫ్రంట్‌లైన్ కాంబాట్ యూనిట్‌కు ఆమె నాయకత్వం వహించనున్నారు. ఫ్రంట్‌లైన్ కాంబాట్ యూనిట్‌కు మహిళా అధికారి నాయకత్వం వహించడం వైమానిక దళ చరిత్రలో ఇదే తొలిసారి.