Eating: కింద కూర్చుని తింటారా..? కుర్చీలు, మంచాలపై కూర్చుని తింటారా..? అసలు ఆరోగ్యానికి ఏది మంచిదంటే..!
ABN , First Publish Date - 2023-05-27T16:50:48+05:30 IST
నేలమీద కాళ్ళను మడిచి కూర్చోవడం వల్ల శరీరంలో కలిగే నొప్పులు నుంచి ఉపశమనం ఉంటుంది..
మన పూర్వకాలం నుంచీ వస్తున్న వస్తున్న చాలా ఆచారాల్లో కొన్ని ఇప్పటికీ అమలవుతున్నా.. కొన్ని మరుగున పడిపోయాయి. ముఖ్యంగా సాంకేతికత వచ్చి కొన్నింటిని మరుగున పడేస్తే, సౌకర్యాలు వచ్చి మరి కొన్ని పద్దతులను మురుగున పడేలా చేసింది. అయితే ఇందులో ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏంటంటే.. నేల మీద కూర్చుని, కాళ్ళు మఠం వేసుకుని కూర్చిని భోజనం చేయడం ఇప్పటి పరిస్థితుల్లో చాలా చోట్ల జరుగుతున్నది. నేలపై కూర్చుని భోజనం చేయడం వల్ల జీర్ణ క్రియ మెరుగు పడుతుంది. జీర్ణ వ్యవస్థకు సహకారంగా ఉండి, జీర్ణం అవుతుంది.
అయితే ప్రస్తుత జనరేషన్ పిల్లలు, పెద్దలూ అంతా కలిసి భోజనం చేయాలంటే దానికి తగ్గట్టుగా పెద్ద భోజనాల బల్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ టేబుల్ మీదనే కుర్చీలపై కూర్చుని భోజనం చేస్తున్నారు. తినేప్పుడు కూర్చునే విధానంలో నేల మీద కూర్చుంటే కాళ్ళు మడిచి కూర్చోవాలని ఈ టేబుల్ సౌకర్యాన్ని ఎంచుకుంటున్నారు. పెద్ద కష్టం లేకుండా ఇలా భోజనం చేస్తున్నారు.
ఇలా కూర్చోవడం ఆరోగ్య రిత్యా మంచిది కాదని అంటున్నారు వైద్యులు. కింద కాకుండా టేబుల్ భోజనం వల్ల పొట్ట మీద ఒత్తిడి పడకుండా సౌకర్యవంతంగా ఉంటుంది భోజనం. అయితే అసలు కింద కూర్చుని భోజనం చేయడం వల్ల పొట్టమీద ఒత్తిడి పడి కండరాల్లో కదలికలకు కారణం అవుతుంది. ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. దీని కారణంగానే పూర్వం నుంచీ ఈ సాంప్రదాయం మన సంస్కృతిలో భాగం అయింది.
ఇది కూడా చదవండి: చల్లగా ఉంటుంది కదా అనీ ఏసీని తక్కువ ఉష్ణోగ్రతలో పెడుతున్నారా..? బహుశా ఈ విషయాలు మీకు తెలిసి ఉండకపోవచ్చు..!
కింద కూర్చుని తింటే..
నేల మీద కూర్చుని తినడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. ఇలా తినడం వల్ల జీర్ణక్రియ సాఫీగా ఉంటుంది. ఈ ప్రక్రియలో భోజనం నోట్లో పెట్టుకోవడానికి ముందుకు వంగడం, నమిలి తినడం, ఇలా చేయడం వల్ల జీర్ణం కావడానికి అవసరమైన ఆమ్లాలు శరీరంలోకి విడుదలవుతాయి.
కాళ్ళు మడిచి కూర్చోవడం వల్ల..
నేలమీద కాళ్ళను మడిచి కూర్చోవడం వల్ల శరీరంలో కలిగే నొప్పులు నుంచి ఉపశమనం ఉంటుంది. ఆరోగ్యంతోపాటు శరీరానికి మంచి వ్యాయమం అందుతుంది.
అధిక బరువు ఉన్నవారికి త్వరగా మోకాళ్ళ నొప్పులు రావడం, శరీరం బరువుగా మారడం అనేది జరుగుతూ ఉంటుంది. నిజానికి ఇలాంటి వారు కింద కూర్చుని భోజనం చేయలేరు. నేల మీద కూర్చోవడం వల్ల గుండెకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది. అదే డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుంటే మాత్రం బ్లడ్ ఫ్లో హార్ట్ కి సరిగా ఉండదు. కాబట్టి వీలైనంత వరకూ కింద కూర్చుని భోజనం చేయడానికే చూడండి. ఇది వెన్ను సమస్యలు, గ్యాస్ సమస్యలను దూరం చేస్తుంది.