Tusks: మీకు తెలుసా?
ABN , First Publish Date - 2023-01-09T23:04:32+05:30 IST
ప్రపంచంలో 20 రకాల పందులు ఉంటాయి. అయితే ఇండోనేషియాలో ఉండే ఈ వరాహం మాత్రం ఒకింత ప్రత్యేకం. నోట్లోనుంచి పొడవైన దంతాలు ఉంటాయి.

ప్రపంచంలో 20 రకాల పందులు ఉంటాయి. అయితే ఇండోనేషియాలో ఉండే ఈ వరాహం మాత్రం ఒకింత ప్రత్యేకం. నోట్లోనుంచి పొడవైన దంతాలు ఉంటాయి. నోటిలోపలి మూలాల్లోంటి వచ్చి కళ్లకు నోటికి మధ్య మరో రెండు పొడవైన కొమ్ముల్లాంటి నిర్మాణం ఉంటుంది. వీటిని టస్క్స్ అంటారు. చూడటానికి వైల్డ్‌గా కనిపించే దీన్ని బబరూస పిగ్ అంటారు.
బబరూసను ‘డెంటల్ ప్రాబ్లం ఉండే వైల్డ్ పిగ్’ అని పిలుస్తుంటారు. ‘పిగ్ డీర్’ అని కూడా అంటారు.
మనకు జుట్టు, గోర్లు పెరిగినట్లే ఈ నాలుగు టస్క్‌లు పెరుగుతాయి. వీటికి రక్తప్రసరణ కూడా అందుతుంది. ఫిమేల్ పిగ్స్‌కి ఈ టస్క్స్ చిన్నగా ఉంటాయి. కొన్నింటికి ఉండవు.
ఈ పిగ్స్ రెండు లేదా మూడు అడుగుల ఎత్తు ఉంటాయి. వందకేజీల బరువు ఉంటాయి.
కూరగాయలు, ఆకుకూరలు, చేపలు, పురుగులు, మష్రూమ్స్ తిని జీవిస్తాయి. మట్టిని తవ్వి లోపల ఉండే క్యారెట్లు లాంటి దుంపలనీ తినగలవు.. వీటితో పాటు నిలబడి చెట్టుమీద ఆకుల్ని తినగల నేర్పు వీటి శరీరానికి ఉంటుంది. రెండు మగ బబరూస్ కొట్లాడితే.. అచ్చు ఇద్దరు మనుషులు డ్యాన్స్ వేసినట్లుంటాయి. అలా రెండు కాళ్ల మీద నిలబడి పోట్లాడతాయి.
ఇవి గంటకు 38 కి.మీ. వేగంతో పరిగెత్తుతాయి. మగ బబరూస్ గుంపుల్లో ఉండవు. ఒంటరిగా ఉంటాయి. ఇక పోతే ఈ జంతువుల జీవితకాలం పదేళ్లు.
చిత్తడినేలల్లో మాత్రమే ఉండే ఈ జాతి 30 వేల ఏళ్ల కితం నుంచి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.