Moto Budget Phone: మోటో బడ్జెట్ ఫోన్
ABN , First Publish Date - 2023-03-31T22:54:33+05:30 IST
మోటోరాల బడ్జెట్ ఫోన్ ‘మోటో జి13’ ఇండియన్ మార్కెట్లోకి వస్తోంది. 6.5 ఇంచీల హెచ్‌డి డిస్‌ప్లే, 720 ్ఠ 1600 పిక్సెల్ రిజల్యూషన్, 90హెచ్‌జెడ్ రిఫ్రషర్ రేటుకుతోడు మీడియాటెక్ ప్రాసెస్ పవర్ కలిగి ఉంది.

మోటోరాల బడ్జెట్ ఫోన్ ‘మోటో జి13’ ఇండియన్ మార్కెట్లోకి వస్తోంది. 6.5 ఇంచీల హెచ్‌డి డిస్‌ప్లే, 720 ్ఠ 1600 పిక్సెల్ రిజల్యూషన్, 90హెచ్‌జెడ్ రిఫ్రషర్ రేటుకుతోడు మీడియాటెక్ ప్రాసెస్ పవర్ కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. 50ఎంపీ మెయిన్ కెమెరా ఉంది. మట్టే చార్‌కోల్, బ్లూ లవెండర్ రంగుల్లో లభ్యమవుతోంది.
ఇందులో రెండు వేరియంట్లు 4జీబీ + 128 జీబీ, 4జీబీ + 64 జీబీ రూ.9,999, రూ.8,4999కి లభిస్తాయి. ఏప్రిల్ 5 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా పొందవచ్చు. ఈ ఫోన్లను కొనుగోలు చేస్తే రూ.50 విలువ కలిగిన 40 క్యాష్‌బ్యాక్ ఓచర్లను రిలయన్స్ జియో అంటే రూ.2,000కు ఇస్తోంది.
రూ.419 ప్లాన్‌కు ఈ ఓచర్లు ఉపయోగపడతాయి. జియో కస్టమర్లు లేదంటే జియోకు బదిలీ అవుతున్న వారు అదనంగా రూ.500 విలువైన మింత్రా గిఫ్ట్ ఓచర్ కూడా పొందవచ్చు.