Indian students: జర్మనీకి భారీగా పెరిగిన భారతీయ విద్యార్థులు
ABN , First Publish Date - 2023-08-12T10:07:16+05:30 IST
2022-23 విద్యా సంవత్సరంలో జర్మనీ (Germany) కి భారతీయ విద్యార్థులు భారీగా పెరిగినట్లు జర్మన్ అకాడమిక్ ఎక్స్ఛేంజ్ సర్వీస్ విడుదల చేసిన డేటా ద్వారా తెలిసింది. 2022-23లో ఏకంగా 42,997 మంది ఇండియన్ స్టూడెంట్స్ (Indian Students) అక్కడి వివిధ విద్యా సంస్థల్లో చేరడం జరిగింది.
బెర్లిన్: 2022-23 విద్యా సంవత్సరంలో జర్మనీ (Germany) కి భారతీయ విద్యార్థులు భారీగా పెరిగినట్లు జర్మన్ అకాడమిక్ ఎక్స్ఛేంజ్ సర్వీస్ విడుదల చేసిన డేటా ద్వారా తెలిసింది. 2022-23లో ఏకంగా 42,997 మంది ఇండియన్ స్టూడెంట్స్ (Indian Students) అక్కడి వివిధ విద్యా సంస్థల్లో చేరడం జరిగింది. అంతకుముంద ఏడాదితో పోలిస్తే ఇది 26శాతం అధికమని జర్మనీ ఫెడరల్ స్టాస్టికల్ ఆఫీస్ వెల్లడించింది. అలాగే మొత్తంగా అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య కూడా 3.7 శాతం పెరుగుదలను నమోదు చేసింది. కాగా, అధికారిక గణాంకాల ప్రకారం జర్మనీలో గడిచిన కొంతకాలంగా భారతీయ విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది.
ఇలా గడిచిన ఐదేళ్లలో రెట్టింపు అయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం జర్మనీ క్యాంపస్‌లలో అతిపెద్ద కమ్యూనిటీలలో మనమే టాప్‌లో ఉన్నాం. జర్మనీలోని ఫెడరల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (Federal Statistical Office of Germany) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం జర్మనీలో అత్యధిక శాతం భారతీయ విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరారు. ఆ తర్వాత మేనేజ్‌మెంట్, సోషల్ స్టడీస్, గణితం, నేచురల్ సైన్సెస్ కోర్సులలో చేరినట్లు గణాంకాలు వెల్లడించాయి.