NRI: అగ్రరాజ్యంలో వైన్ ఇండస్ట్రీని ఏలుతున్న భారతీ మహిళ.. 20 ఏళ్ల కింద మొదలైన ఆమె ప్రస్థానం.. ఇప్పుడు కోట్లలో వ్యాపారం
ABN , First Publish Date - 2023-07-02T09:06:29+05:30 IST
మహిళలకు పూర్తి విరుద్ధమైన రంగం అది. కానీ, ఆమె ఆ రంగాన్నే తన కెరీర్‌గా ఎంచుకుంది.
ఎన్నారై డెస్క్: మహిళలకు పూర్తి విరుద్ధమైన రంగం అది. కానీ, ఆమె ఆ రంగాన్నే తన కెరీర్‌గా ఎంచుకుంది. ఇప్పుడు అందులోనే రాణిస్తూ, అందరితో శభాష్ అనిపించుకుంటుంది. అగ్రరాజ్యం అమెరికాలో వైన్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపుతో దూసుకెళ్తోన్న ఓ భారతీ మహిళ సక్సెస్ స్టోరీ ఇది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జోయా వోరా షా( Zoya Vora Shah ) కొన్నేళ్ల క్రితం ఇండియా నుంచి యూఎస్ వెళ్లారు. అక్కడే సెటిల్ అయ్యారు. మొదట ఓ రెస్టారెంట్‌లో తన వైన్ వ్యాపారాన్ని మొదలెట్టారు. ఆ తర్వాత అరిజోనాలోని (Arizona) స్కాట్స్‌డేల్ టౌన్‌లో 'ది వైన్ కలెక్టివ్ ఆఫ్ స్కాట్స్‌డేల్' (The Wine Collective of Scottsdale) ప్రారంభించారు. ఆ నగరంలో ఆమె స్థాపించిన ఎనిమిదో వైన్ టేస్టింగ్ రూం అది.
ఇందులో రకరకాల వైన్ తయారీ కేంద్రాలు ఉన్నాయి. అన్ని వైన్స్ టేస్ట్ చేసేందుకు వీలు కల్పించే ఈ వైన్ కలెక్టివ్ నగర వాసులకు ప్రస్తుతం కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. ఇక జోయా 20 ఏళ్ల క్రితం ఫ్లోరిడాలోని జాక్సన్‌విల్లేలోని ఒక రెస్టారెంట్‌లో పనిచేస్తున్నప్పుడు అక్కడ ఆమె వైన్ పెయిరింగ్‌పై పట్టు సాధించారు. ఆ తర్వాత వైన్, స్పిరిట్స్ విక్రయాల ప్రతినిధిగా మారారు. అనంతరం వైన్ వర్గీకరణలలో సర్టిఫికేషన్లు కూడా పొందారు. అలా జోయా.. వాషింగ్టన్ డీసీలోని మోయెట్ హెన్నెస్సీ, డియాజియో నుంచి పోర్ట్‌ఫోలియోలకు ప్రాతినిధ్యం వహించే అరుదైన అవకాశాన్ని సైతం అందుకున్నారు. ఆ సమయంలో షాంపైన్‌లో తన నైపుణ్యాన్ని మరింతగా పెంచుకున్నారు. ఆ తర్వాత ఆమె స్థాపించిన వైన్ కలెక్టివ్ అనేది ప్రీమియం అరిజోనా వైన్ టేస్టింగ్ రూమ్ (Wine Tasting Room), వైన్ బార్ (Wine Bar), బాటిల్ షాప్ (Bottle Shop) గా మారింది.
UAE: రూ.55లక్షలు విలువైన వాచీని సముద్రంలో పారేసుకున్న విజిటర్.. ఆ తర్వాత యూఏఈ పోలీసుల చాకచక్యంతో..
ఇక ఈ కంపెనీ అతిథుల అభిరుచులకు అనుగుణంగా వైన్స్‌ను క్యూరేట్ చేయడంలో ప్రత్యేకత కలిగి ఉండడం విశేషం. అంతేగాక ప్రత్యేకమైన టేస్ట్ వర్క్‌షాప్‌ను కూడా అందిస్తుంది. ఇక వైన్ ఇండస్ట్రీ అనేది ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. అయినా అందులో ఆమె రాణించడం అనేది చెప్పుకోదగిన విషయం. దీనికి ప్రధాన కారణం తాను చేస్తున్న పనిపై తన అభిరుచిని కొనసాగించడమే అంటున్నారు జోయా. కాగా, ఇండియా నుంచి వెళ్లిన కొత్తలో చాలామంది ఆమె ఎంచుకున్న రంగాన్ని తీవ్రంగా విమర్శించారట. ఓ మహిళ ఇలాంటి రంగంవైపు వెళ్లడమేంటని దుయ్యబట్టారట. అయినా ఆమె పట్టుదలతో తనను తాను నిరూపించుకున్నారు. విమర్శకుల మాటలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లారు. ఇక తాను ఇంత పెద్ద సక్సెస్ సాధించానంటే దానికి ప్రధాన కారణం తన భర్త అందించిన సహాకారం అని ఆమె పేర్కొన్నారు. అదే సమయంలో కొంతమంది స్నేహితులు కూడా తనకు మద్దతు ఇచ్చారని జోయా తెలిపారు. ఇలా వారందరి ప్రోత్సాహానికి తోడు తన పట్టుదలతో ఇవాళ వైన్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపుతో దూసుకెళ్తున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె చేస్తున్న ఈ వైన్ బిజినెస్ కోట్లలో ఉన్నట్లు సమాచారం.
NRI: మేటి వలసదారుడిగా ఎంపికైన ఎన్నారై అజయ్ బంగా