TANA: ‘తానా’లో ‘అడ్వాన్సింగ్ హెల్త్ త్రూ డిస్‌రప్టివ్ ఇన్నోవేషన్’ కార్యక్రమం!

ABN , First Publish Date - 2023-07-06T16:18:33+05:30 IST

అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జూలై 7-9 మధ్య జరగనున్న 23వ తానా(TANA) సమావేశాలలో 'అడ్వాన్సింగ్ హెల్త్ త్రూ డిస్‌రప్టివ్ ఇన్నోవేషన్' కార్యక్రమం జరగనుంది.

TANA: ‘తానా’లో ‘అడ్వాన్సింగ్ హెల్త్ త్రూ డిస్‌రప్టివ్ ఇన్నోవేషన్’ కార్యక్రమం!

  • 'పద్మశ్రీ డాక్టర్ దత్తాత్రేయుడు నోరి' ప్రసంగం

అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జూలై 7-9 మధ్య జరగనున్న 23వ తానా(TANA) సమావేశాలలో 'అడ్వాన్సింగ్ హెల్త్ త్రూ డిస్‌రప్టివ్ ఇన్నోవేషన్' కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య రంగాల్లో ఇటీవల వెలువడిన నూతన ఆవిష్కరణలు, వాటి ప్రభావాలపైన ఆయా రంగ ప్రముఖులతో చర్చ, ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 'క్యాన్సర్ నిర్వహణలో.. మనం ఎక్కడ ఉన్నాం' అనే అంశంపై 'పద్మశ్రీ డాక్టర్ దత్తాత్రేయుడు నోరి' ప్రసంగించనున్నారు. ఫిలడెల్ఫియా పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్, జూలై 8న రూమ్ నెం: 201-AB, మధ్యాహ్నం 2:00 గం - 3:00 గం జరగబోయే ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే.

మోహన్ చదలవాడ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రపంచ ప్రసిద్ధి చెందిన క్యాన్సర్ నిపుణులు పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ దత్తాత్రేయుడు నోరి, డాక్టర్ ఉమేష్ సాలిగ్రామం, ఎగ్జిక్యూటివ్ డైరెక్టెర్, ఆర్‌ & డి, సీరం ఇన్స్టిట్యూట్, డాక్టర్ అజిత్ సింగ్, పార్టనర్ ఆర్తిమాన్ వెంచర్స్, నరేన్ సోని, వెంచర్ పార్టనర్, సెర్రాక్యాప్ వెంచర్స్ తదితరులు హాజరు కాబోతున్నారు. డాక్టర్ హిమబిందు గడ్డిపాటి, సీఈఓ, బయోలారా విసిర్ పార్క్ ఈ కార్యక్రమానికి మోడరేటర్‌గా వ్యవహరిస్తారు. ఈ అపూర్వ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.

2.jpg3.jpg

Updated Date - 2023-07-06T16:21:24+05:30 IST