NRI: జెద్ధాలో వైభవంగా క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు

ABN , First Publish Date - 2023-01-03T16:02:08+05:30 IST

సౌదీ అరేబియా వాణిజ్య రాజధాని జెద్ధా నగరంలోని తెలుగు ప్రవాసీ కుటుంబాలు కూడా ఈ వేడుకలను తమదైన శైలీలో నిర్వహించుకున్నారు.

NRI: జెద్ధాలో వైభవంగా క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: వివిధ గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న తెలుగు ప్రవాసీయులు(Telugu NRIs) క్రిస్మస్(Christmas), నూతన సంవత్సర వేడుకలను(New Year Celebrations) విభిన్న రీతిలో ఆనందోత్సాహాల మధ్య ఉల్లాసంగా నిర్వహించుకున్నారు. సౌదీ అరేబియా వాణిజ్య రాజధాని జెద్ధా(Jeddah) నగరంలోని తెలుగు ప్రవాసీ కుటుంబాలు కూడా ఈ వేడుకలను తమదైన శైలీలో నిర్వహించుకున్నారు.

క్రిస్మస్ అనే మాటకు క్రీస్తును ఆరాధించుట అని అర్థమని, ఆ ఆరాధన హృదయాంతరాళాల నుండి పెల్లుబుకాలని క్రైస్తవ పెద్దలు ఈ సందర్భంగా సందేశమిచ్చారు. సత్య వాక్యమైయున్న దేవుడు రక్తమాంసాలతో జన్మించి పుడమిని పులకరింపజేసిన సమయమిదని వక్తలు పెర్కోన్నారు. నలదం చర్చి పాస్టర్ సిమ్సన్, ఇమ్యూనల్, జాన్, మమత, సైమన్ పీటర్, చరిత్ర, సుదీప్, నవీన్, ప్రదీప్ నానీ తదితరులు సమన్వయం చేసిన ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక మంది కూడా పాల్గొన్నారు. చిన్నారులకు రూత్ క్విజ్ పోటీలను నిర్వహించగా ఇతర సాంస్కృతిక, ధార్మిక కార్యక్రమాలను కూడా నిర్వహించారు.

జెద్ధాలోని తెలుగు ప్రవాసీ సంఘమైన జె.టి.యం, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకురాలు గాలి దుర్గా భవానీ, వర్ష ఇతరులు కూడా కార్యక్రమంలో పాల్గొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు.

2.jpg1.jpg

Updated Date - 2023-01-03T16:02:09+05:30 IST

News Hub