TS Assembly Polls : ఎన్నికల సమయంలో తెలంగాణకు కేంద్రం భారీగా నిధులు.. ఎన్నికోట్లు ఇచ్చిందంటే..?

ABN , First Publish Date - 2023-09-03T17:24:47+05:30 IST

అవును.. మీరు వింటున్నది నిజమే. ఇన్ని రోజులు కేంద్రం నిధులివ్వట్లేదు అని కేసీఆర్ సర్కార్ (KCR Govt) చెబుతుండగా.. ఇదిగో ఇంత ఇచ్చామని లెక్కలతో సహా తెలంగా బీజేపీ (TS BJP) చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే...

TS Assembly Polls : ఎన్నికల సమయంలో తెలంగాణకు కేంద్రం భారీగా నిధులు.. ఎన్నికోట్లు ఇచ్చిందంటే..?

అవును.. మీరు వింటున్నది నిజమే. ఇన్ని రోజులు కేంద్రం నిధులివ్వట్లేదు అని కేసీఆర్ సర్కార్ (KCR Govt) చెబుతుండగా.. ఇదిగో ఇంత ఇచ్చామని లెక్కలతో సహా తెలంగా బీజేపీ (TS BJP) చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. తెలంగాణలో ఎన్నికలు (TS Assembly Polls) సమీపిస్తుండటంతో కేంద్రంలోని మోదీ సర్కార్ (Modi Govt) నిధులు వెల్లువలా ఇచ్చింది. ఇంతకీ ఆ నిధులు ఏంటి..? ఎన్నివేల కోట్లు వచ్చే అవకాశముంది..? అనే ఇంట్రస్టింగ్ విషయాలు ఇప్పుడు చూద్దాం..


modi.jpg

నిధులొచ్చాయ్..!

రూ. 80 వేల కోట్లతో తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నూతన రైల్వే లైన్లను (Railway Lines) ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) వెల్లడించారు. ఆదివారం నాడు మీడియా మీట్ నిర్వహించిన ఆయన.. రైల్వే ప్రాజెక్టులపై కీలకమైన ప్రకటన చేశారు. ప్రతి జిల్లాను టచ్ అయ్యేలా ప్రణాళికలను కేంద్ర సిద్ధంచేసింది. ఇప్పటికే పెద్దపల్లి మినహా ప్రతి జిల్లా కేంద్రాన్ని కలుపుతూ నేషనల్ హైవేస్‌తో అనుసంధానం జరిగిన విషయం విదితమే. అయితే ఇప్పుడు రైల్వేలతో సైతం అనుసంధానం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి.

Kishn-Reddy.jpg

సర్కార్ సహకరించట్లేదు..!

రాష్ట్రంలో రైల్వేను కేంద్రం ఆధునీకరించింది.మూలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నాం. 32 జిల్లాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేశాం. 33 జిల్లాలను రైల్వేతో కనెక్టివిటీ చేస్తాం. 13 వందల కిలోమీటర్ల రైల్వే లైన్ల కోసం భూసేకరణ చేస్తున్నాం. భూ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదు. రైల్వే విస్తరణ.. రాష్ట్రానికి ఇష్టం లేదు. హైదరాబాద్-యాదాద్రి లైన్‌ను మంజూరు చేశాం. ప్రతి ఏటా 55 కిలోమీటర్ల రైల్వేలైన్ వేస్తున్నాం. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తోంది. కేంద్ర ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. మంజూరైన ప్రాజెక్టుల భూసేకరణకు సహకరించాలి. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ పార్కింగ్‌కు భూమి అడిగాం. భూమి అడిగితే రాష్ట్ర ప్రభుత్వం స్పందించడంలేదు. చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ 2024లో ప్రారంభిస్తాం. చర్లపల్లి కనెక్టివిటీ రోడ్‌కు కూడా రాష్ట్రం స్పందించడంలేదు. MMTS ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదు. యాదాద్రి MMTS భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. త్వరలో సికింద్రాబాద్‌-బెంగళూరు వందేభారత్‌ రైలు ప్రారంభిస్తాంఅని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.

kcr with Map.jpg

కాగా.. ఈ మధ్య బీజేపీ-బీఆర్ఎస్ కలిసే అడుగులు ముందుకేస్తున్నాయన్నది పలు సందర్భాల్లో నిరూపితమైన సంగతి తెలిసిందే. అందుకే ఇన్నిరోజులూ తెలంగాణను పెద్దగా పట్టించుకోని కేంద్రం.. ఇప్పుడు ఎన్నికలు అనేసరిగి మునుపెన్నడూ విధంగా నిధులు ఇవ్వడం గమనార్హం. అయితే ఈ నిధులు ఇప్పుడే ఎందుకొచ్చాయి..? ఇన్నిరోజులు లేని తెలంగాణపై ప్రేమ ఇప్పుడు ఎందుకు ఇంతలా..? అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ నిధుల వ్యహారంపై అటు బీజేపీ.. ఇటు బీఆర్ఎస్ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సిందే.

KCR-And-Modi.jpg


ఇవి కూడా చదవండి


Land On Moon : చంద్రుడిపై జోరుగా రియల్ ఎస్టేట్.. రెండెకరాల భూమి కొన్న కృష్ణా జిల్లా వాసి..


Massive Rain Alert : తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముఖ్య గమనిక.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో రేపు అతి భారీ వర్షాలు


Updated Date - 2023-09-03T17:52:09+05:30 IST