Political BRO : ‘ బ్రో’ సినిమా వివాదంపై మొదటిసారి స్పందించిన పవన్ కల్యాణ్..
ABN , First Publish Date - 2023-08-04T17:28:07+05:30 IST
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan), సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) ప్రధాన పాత్రల్లో నటించిన ‘బ్రో’ (BRO) మూవీపై ఏపీ రాజకీయాల్లో (AP Politics) పెద్ద దుమారమే రేగుతోంది...
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan), సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) ప్రధాన పాత్రల్లో నటించిన ‘బ్రో’ (BRO) మూవీపై ఏపీ రాజకీయాల్లో (AP Politics) పెద్ద దుమారమే రేగుతోంది. ఇందులో సీఎం వైఎస్ జగన్ రెడ్డిని (CM YS Jagan Reddy) ఉద్దేశించి కొన్ని డైలాగ్స్, మంత్రి అంబటి రాంబాబు (Minister Rambabu) సంక్రాంతి పండుగకు వేసిన డ్యాన్స్‌ను ఇమిటేట్ చేస్తున్నట్లు ఉన్నాయని ఈ మూవీ టీమ్‌పై వైసీపీ శ్రేణులు (YSR Congress) మండిపడుతున్నాయి. ఛాన్స్ దొరికితే చాలన్నట్లుగా మునుపటిలాగే పవన్‌పై సోషల్ మీడియా (Social Media) వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికే అటు చిత్రబృందం.. ఇటు అంబటి రాంబాబు ఒకరిపై ఒకరు ఓ రేంజ్‌లో విమర్శలు గుప్పించుకున్నారు. సీన్ కట్ చేస్తే ఈ వ్యవహారం గల్లీ నుంచి ఢిల్లీకి చేరింది. ‘బ్రో’ మూవీపై ఫిర్యాదు చేయడానికి అంబటి హస్తినకు వెళ్లారు. అయితే ఇంత వివాదం జరుగుతున్నా ఇంతవరకూ స్పందించని పవన్ కల్యాణ్ మొదటిసారి స్పందించారు.
నేనే వదిలేశా..!
‘ రాజకీయాల్లోకి సినిమాను తీసుకురాకండి. నా సినిమా గురించి వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. ఇష్యూను డైవర్ట్ చేసేలా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. సినిమా గురించి, నన్ను తిట్టడం గురించి డిబేట్స్ ఎందుకు..?. పొలిటికల్ డిబేట్స్‌ను కొంతమంది తప్పుదోవ పట్టించి మిమ్నల్ని (జనసేన నేతలను) రెచ్చగొడుతున్నారు. నన్ను తిట్టారని మీరు కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దు. మన జనసేనకు భాష ముఖ్యం.. విధానాలపై ప్రశ్నించండి. నా సినిమాను నేనే వదిలేశాను.. మీరు ఎందుకు ఆవేశపడతారు..?. కావాలనే చేసే కుట్రలో మీరు చిక్కుకోవద్దు. డిబేట్ తాలూకూ స్థాయి జనసేన నాయకుల ద్వారా పెరగాలి. వాళ్ల స్థాయికి మీరు దిగజారవద్దు. నన్ను తిడితే నా శరీరం ఏమీ చిల్లు పడిపోదు కదా. మనం ఏది మాట్లాడినా రాష్ట్రం కోసం, ప్రజల కోసం అనేలా ఉండాలి. నన్ను తిట్టినా ఏంకాదు.. రాజకీయాలు నడిపేందుకు సినిమాలు ఒక ఇంధనం’ అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.
ఏపీ ప్రభుత్వంపై..!
ఏపీని పాలించడానికి వైఎస్ అనర్హుడు. అటువంటి వ్యక్తిని గద్దె దించాలి. దిష్టి బొమ్మను ఊరేగిస్తే మన వాళ్లపై క్రిమినల్ కేసులు పెట్టారు. అటువంటి వారికి మన నాయకులు అండగా ఉండాలి కదా..?. బీజేపీ నాయకులపై పోలీసులు దాడి చేస్తే నేను స్పందించాను. మన జనసేన నాయకులపై దాడి జరిగితే కనీసం స్పందించరా..?. ఎన్డీఏ సమావేశంలో మనకు ఇచ్చిన ప్రాధాన్యత చూశారు కదా.!. నిజాయితీగా పని చేస్తే గుర్తింపు అదే వస్తుంది. పరాజయంలో వచ్చే నిశ్శబ్దం భయంకరంగా ఉంటుంది. అయినా ఎన్నో తట్టుకుని ప్రజల కోసం నేను నిలబడ్డాను. ఒక్కసారి మాట ఇస్తే కంఠం తెగి పడే వరకు అలాగే ఉంటాను. భవిష్యత్తులో జనసేన ప్రభుత్వం తప్పకుండా ఏర్పాటు చేస్తాం. నా భారతదేశం కోసం పని చేస్తున్నా అనుకోవాలి. జగన్, అతని అనుచరులు మానవ వనరులను దోపిడీ చేస్తున్నారు. వాటిపై అందరం కలిసి పోరాటం చేయాలి. ఇది మన జనసేన కేంద్ర కార్యాలయం. భవనం నిర్మాణం అయితే పూర్తి కార్యకలాపాలు ఇక్కడి నుంచే జరుగుతాయి. వెనుక చిన్న నివాసం ఏర్పాటు చేసుకుని ఇక్కడే ఉంటాను. మంగళగిరిలోని జనసేన కార్యాలయం నా ఇల్లు’ అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.
జనసేన నేతలకు క్లాస్!
‘జగన్ దుర్మార్గపు పాలనను తరిమి కొట్టాలి.. జనసేనను అధికారంలోకి తేవాలి. ఈ ప్రభుత్వాన్ని సాగనంపడానికి ప్రజలు సిద్దం గా ఉన్నారు.. నాయకులే లేరు. పది వేల ఓట్లు తెచ్చుకోలేని వారు నాయకుడు అంటే ఎలా..?. నా చుట్టూ తిరిగితే నాయకులు అవ్వరు. కలిసినవారినే కలవడం అంటే నాకు సమయం వృథా. ప్రజలకు చేరవగా ఉంటూ వారిని తమ ఓటర్లుగా మార్చుకోవాలి. 2019 విధానం కాకుండా సరికొత్త విధానంలో అభ్యర్థులు ఎంపిక ఉంటుంది. స్థానిక అంశాలు, అభిప్రాయాలు, సర్వే నివేదికల ద్వారా సీట్లు ఉంటాయి. అన్ని వ్యవస్థల్లో దోపిడీ జరుగుతున్న మాట వాస్తవం. ప్రజల వ్యక్తిగత డేటా ప్రైవేటు సంస్థల చేతికి వెళ్లింది. విశాఖ వారాహి యాత్రతో మరింత బలంగా జనసేన దూసుకెళ్తోంది. అక్కడ దోపిడీ, దౌర్జన్యాలను ప్రజలకు వివరిస్తాం. ఒక ఎంపి కుటుంబాన్ని కిడ్నాప్ చేస్తే పోలీసులు మౌనంగా ఉన్నారు. అక్కడ ఏం జరిగిందో తరువాత అందరూ చూశారు. ఉభయ గోదావరి జిల్లాల తరహాలో విశాఖలో వారాహి యాత్రకు మంచి స్పందన ఉంటుంది. విశాఖ జిల్లాలో కూడా వైసీపీకి ఒక్క సీటు కూడా రాకుండా చేద్దాం. మంచి నాయకులు పార్టీలోకి వస్తామంటే ఆహ్వానిద్దాం. మూడో విడత వారాహి యాత్రకు అందరూ సిద్దంకండి’ అని జనసేనాని పిలుపునిచ్చారు.