Anam: ఫుట్‌బాల్ ఆడిస్తానంటూ వైసీపీ నేత నేదురుమల్లిపై ఎమ్మెల్యే ఆనం ఘాటు వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-06-25T22:53:22+05:30 IST
వెంకటగిరి వైసీపీ ఇంచార్జి నేదురుమల్లి (Nedurumalli) రాంకుమార్‌రెడ్డిపై ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి (Anam) ఫైర్ అయ్యారు.
నెల్లూరు: వెంకటగిరి వైసీపీ ఇంచార్జి నేదురుమల్లి (Nedurumalli) రాంకుమార్‌రెడ్డిపై ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి (Anam) ఫైర్ అయ్యారు. 'నేదురుమల్లి ఇష్టానుసారం మాట్లాడితే పడేవాళ్లు లేరు. మాకు నీ అంత ప్రావీణ్యం లేకపోయినా 2024 ఎన్నికల్లో మాత్రం నిన్ను ఫుట్‌బాల్ ఆడిస్తా. వెంకటగిరిలో ఫుట్‌బాల్ ఆడేవాళ్లను తయారు చేస్తా. ఈసారి నీకేం పగులుతుందో నాకే తెలియదు. నేదురుమల్లి చదువుకుంటే సరిపోదు.. సంస్కారం నేర్చుకో. సంస్కారహీనులను వెంకటగిరి ప్రజలు ఆదరించరు.' అని ఆనం రామనారాయణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
'2019లో జరిగిన ఎన్నికల్లో గెలవని వెంకటగిరి నియోజకవర్గానికి టికెట్ నాకు ఇచ్చారు. వెంకటగిరి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం. వైసిపి వెంకటగిరిలో నాకు ఒక్కసారి టికెట్ అవకాశం ఇచ్చింది. వైసిపికి స్థానిక సంస్థలు, తిరుపతి ఉప ఎన్నికతో కలిపి నాలుగుసార్లు విజయం అందించాను. నేదురుమల్లి గడచిన ఎన్నికల్లో నీ ప్రతాపం చూశాను. రేపు మూడోసారి ఆడాలనుకుంటే నాకేమి ఇబ్బంది లేదు. వెంకటగిరిలో ఫుట్ బాల్ ఆడేవాళ్ళను తయారు చేస్తా!. ఏదైనా సంస్కారమైన మాటలు మాట్లాడుకుంటే మంచిది. వెంకటగిరికి చరిత్ర ఉంది. ఒక ప్రాముఖ్యత ఉంది. ఒకరి ఇద్దరి వల్ల చెడుతుంది. వెంకటగిరి ఎమ్మెల్యేగా 6 నెలలు జస్ట్ గ్యాప్ ఇచ్చా!. వెంకటగిరిని ఎప్పుడూ వదలలేదు. నేను ఫుట్ బాల్ ఆట ఆడేందుకు సిద్ధంగా ఉన్నా... నిన్ను వెంకటగిరిలో ఉన్న ఆరు మండలాల్లో ఫుట్ బాల్ ఆడిస్తా'. అని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం హెచ్చరించారు.