Taraka Ratna Death : బాలయ్యా.. మీరు సూపరయ్యా.. తారకరత్న కోసం నిద్రాహారాలు మాని.. దండం పెడుతున్న ఫ్యాన్స్.. రూపాయితో సహా..!

ABN , First Publish Date - 2023-02-18T22:52:58+05:30 IST

‘ ఆయన మాట కాస్త కటువుగా ఉంటుందే కానీ మనసు మాత్రం వెన్న..’ ఇదీ టాలీవుడ్ అగ్రనటుల్లో ఒకరైన నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) గురించి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఎప్పుడూ చెప్పుకునే మాట...

Taraka Ratna Death : బాలయ్యా.. మీరు సూపరయ్యా.. తారకరత్న కోసం నిద్రాహారాలు మాని.. దండం పెడుతున్న ఫ్యాన్స్.. రూపాయితో సహా..!

‘ ఆయన మాట కాస్త కటువుగా ఉంటుందే కానీ మనసు మాత్రం వెన్న..’ ఇదీ టాలీవుడ్ అగ్రనటుల్లో ఒకరైన నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) గురించి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఎప్పుడూ చెప్పుకునే మాట. చిన్నోడా.. పెద్దోడా అనే తారతమ్యాలుండవ్.. అందరితోనూ ఒకేలా ఉంటారు.. ఎప్పుడూ మనసులోని మాటను కుండబద్ధలు కొట్టినట్లు చెప్పేస్తుంటారు.. బహుశా అందుకేనేమో బాలయ్య ఏం మాట్లాడినా, ఏం చేసినా వివాదమే అవుతుంటుంది. బాలయ్య మాటల్లోనే కాదు.. చేతల మనిషి కూడా. అభిమానులు అతిచేస్తే చాచి రెండిచ్చేస్తుంటారు.. అదే అభిమాని లేదా సామాన్యుడు.. సార్ ఇదీ పరిస్థితి అని బాధలు చెప్పుకుంటే మనసు కరిగిపోయి కష్టాల్లో నుంచి గట్టెక్కిస్తుంటారు.. ఇదీ బాలయ్యను దగ్గర్నుంచీ చూసిన వ్యక్తులు చెప్పే మాటలు. ఇటు సినిమాలు.. అటు రాజకీయాలతో నిత్యం బిజిబిజీగా ఉండే బాలయ్య కుటుంబ సభ్యులతో గడపాలన్నా సమయం ఉండదు. కానీ.. తన అన్న కుమారుడు తారకరత్న ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతుంటే అన్ని పనులు మాని అన్నీ తానై చూసుకుంటూ ఆస్పత్రికే అంకితమయ్యారు బాలయ్య. ఒక్క మాటలో చెప్పాలంటే తండ్రి తర్వాత తండ్రిగా తారకరత్న బాధ్యతలన్నీ భుజానికెత్తుకున్నారని చెప్పుకోవచ్చు.

నాటి నుంచి నేటి వరకూ..!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘యువగళం’ పాదయాత్ర మొదటి రోజున అనగా జనవరి 27 తారకరత్న కూడా పాల్గొన్నారు. లోకేష్, బాలయ్య బాబాయ్‌తో కలిసి నడుస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు తారకరత్న. ఆయన్ను గమనించిన కార్యకర్తలు.. బాలయ్యకు విషయం చెప్పగానే హుటాహుటిన కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించారు. తీవ్ర హార్ట్‌స్ట్రోక్ కావడంతో యాంజియోప్లాస్టీ నిర్వహించిన తర్వాత కుప్పంలోని ప్రముఖ పీఈఎస్‌‌కు (PES) ఆస్పత్రికి తరలించారు. అక్కడ కూడా ఆరోగ్యం మెరుగుకాకపోవడంతో అర్ధరాత్రి కుప్పం (Kuppam) నుంచి బెంగళూరులోని (Bangalore) నారాయణ హృదయాలయ (Narayana Hrudayalaya) ఆస్పత్రికి తరలించారు. కేసీ ఆస్పత్రిలో చేర్చింది మొదలుకునే అర్ధరాత్రి బెంగళూరుకు తరలించే వరకు నిద్రాహారాలు మాని తారకరత్న వెంటే ఉంటూ అన్నీ తానై చూసుకున్నారు బాలయ్య. అంతేకాదు.. బెంగళూరులో చికిత్స పొందుతున్నప్పటి నుంచి ఒకట్రెండు సార్లు ఇంటికి వచ్చారంతే.. మిగిలిన 20 రోజులు అక్కడే ఉండి తారకరత్నకు మెరుగైన వైద్యం అందించేందుకు చాలా తాపత్రయపడ్డారు. అటు డాక్టర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వివరాలు అడిగి తెలుసుకుంటూ.. ఇటు కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ వచ్చారు బాలయ్య. అంతేకాదు.. అభిమానులకు సైతం భరోసానిస్తూ చెక్కుచెదరని మనో నిబ్బరాన్ని ప్రదర్శించారు.

Balayya-and-Tarakratna-1.jpg

ఒక్క రూపాయితో సహా..!

బాలయ్య దగ్గరుండి చూసుకోవడం అంటే డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకోవడమే కాదు.. తారకరత్న ట్రీట్మెంట్‌కు సంబంధించి ప్రతీ పరిక్షకు, చిన్న టాబ్లెట్‌కు కూడా తన జేబు నుంచే డబ్బులు తీసి ఇచ్చేవారట. ఎక్కడున్నా సరే సోమవారం అయ్యిందంటే చాలు బెంగళూరు ఆస్పత్రికి చేరుకుని ఒక్క రూపాయితో సహా మొత్తం బిల్లు బాలయ్యే చెల్లించేవారట. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ‘ ఇన్ని రోజులు నాణేనికి ఒకవైపు బాలయ్యనే చూశారు.. ఇదీ నాణేనికి మరోవైపు బాలయ్య.. ఇదే ఆయనలోని మరో యాంగిల్’ అంటూ అభిమానుల్లో ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Taraka-Ratna-2.jpg

శత్రువులు సైతం..!

ఇన్ని రోజులు తారకరత్నకు అన్నీ తానై అండగా ఉన్న బాలయ్యను నెటిజన్లు, నందమూరి-నారా అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ‘ఒక్కోసారి ఆయన మాట తడబడుతుందేమో కానీ.. మనసు ఎప్పుడు తడబడదు’ అని కొందరు అభిమానులు మెచ్చుకుంటున్నారు. ‘బాలయ్య.. స్వచ్ఛమైన ఆ మనసుకి అచ్చమైన అభిమానులం’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక బాలయ్య వీరాభిమానులు అయితే.. ‘ బిడ్డ బతుకు కోసం బాబాయ్ ఆరాటం’ అంటూ బాలయ్య ఐసీయూ బయట దిగాలుగా నిల్చున్న ఫొటోను నెట్టింట్లో పోస్ట్ చేసి ‘బాలయ్య.. మీరు సూపరయ్యా..’ అని దండం పెట్టేస్తున్నారు. తారకరత్న మళ్లీ మాములు మనిషై తిరిగి రావాలని బాలయ్య పడుతున్న వేదన, తపన శత్రువులను సైతం కదిలించేసింది. తన అన్న కొడుకు ఆరోగ్యం కోసం బాలయ్య ఎంతో పరితపిస్తున్నారని.. నిజంగా ఆయనకు థ్యాంక్స్ అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డే (YSRCP MP Vijayasai Reddy) నోటి నుంచే ఈ మాటలు వచ్చాయంటే ఆయన గురించి ఇంతకంటే ఏం చెప్పగలం.

ఓ డై హార్డ్ ఫ్యాన్ ఇలా..!

ఇదిగో.. ‘ఈ ఫొటోలో ఉన్న మనిషిని చూడండి. ఓ వైపు 108వ సినిమా షూటింగ్ అవుతోంది. హిందూపురంలో అనేక ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి, సొంత అల్లుడు జీవితంలో అతి పెద్ద ప్రయాణం ప్రారంభించాడు.. తల్లిలా చూసుకునే ఆసుపత్రి ఉంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే రోజుకి 24 గంటలు కూడా సరిపోని షెడ్యూల్ ఆయనిది. కానీ తారకరత్నకు అలా జరిగినపుడు అన్ని తానే అయ్యాడు.. అండగా నిలబడ్డారు. దేశంలోనే పవర్‌ఫుల్ ఫ్యామిలీస్‌లో ఒకటి బాలయ్య ఫ్యామిలీ. ఆయన వియ్యంకులు ఇద్దరూ అంతే. ఆ మనిషి ఆవేశంలో అన్న మాటలు హైలెట్ అవుతాయి.. యధాలాపంగా అన్న మాటలు గాలివానలు అవుతాయి.. సరదాగా అనే మాటలు బ్రేకింగ్ న్యూస్ అవుతాయి.. అతని మాట తడబడుతుంది ఏమో, మనసు ఎప్పుడు తడబడదు. అన్ని పనులు వదులుకుని ఆ హాస్పిటల్లో ఉంటూ అందరికీ ధైర్యం చెప్తూ.. స్వచ్ఛమైన ఆ మనసుకి అచ్చమైన అభిమానులం’ అని ఓ డై హార్డ్ ఫ్యాన్ (Die Hard Fan) తన ఫేస్‌బుక్ ఖాతాలో రాసుకొచ్చారు.

ఎంతసేపూ బాలయ్య అంటే అలా ఉంటారు.. ఇలా ఉంటారు అని చెబుతుంటూనే విన్నారు కదా.. ఇప్పుడు ఆయన నిజస్వరూపం ఎలా ఉంటుందో అందరూ కళ్లారా చూశారుగా.. ఇదే అక్షరాలా నిజమని ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి..

TarakaRatna : ఎమ్మెల్యేగా పోటీచేయాలనుకున్న తారకరత్న... చంద్రబాబు, లోకేష్‌తో కూడా చర్చ.. అయ్యో పాపం చివరికోరిక తీరకుండానే..!

Updated Date - 2023-02-18T23:40:37+05:30 IST