Agent: ఫస్ట్ సింగిల్.. ఏదో కల్లోలం మొదలైనట్లుందే..

ABN , First Publish Date - 2023-02-22T20:38:28+05:30 IST

అఖిల్ అక్కినేని (Akhil Akkineni), స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి (Surender Reddy) క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఏజెంట్’ (Agent). ఈ సినిమా విడుదలకు సంబంధించి

Agent: ఫస్ట్ సింగిల్.. ఏదో కల్లోలం మొదలైనట్లుందే..
Agent Movie Still

అఖిల్ అక్కినేని (Akhil Akkineni), స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి (Surender Reddy) క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఏజెంట్’ (Agent). ఈ సినిమా విడుదలకు సంబంధించి ఇప్పటికే అనేక మార్లు వార్తలు వచ్చాయి. విడుదల వాయిదా పడుతూనే ఉంది కానీ.. ఈ చిత్రం విడుదలకు నోచుకోలేదు. ప్రతీసారి ఏదో ఒక రీజన్‌తో వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రాన్ని ఈ సారి మాత్రం ఖచ్చితంగా విడుదల చేసేలా.. పక్కా ప్లాన్‌తో మేకర్స్ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ఈ సినిమా విడుదల కాబోతోంది. చిత్ర ప్రమోషన్స్‌‌లో భాగంగా బుధవారం మొదటి సింగిల్ (First Single) ‘మళ్ళీ మళ్ళీ నువ్వే’ (Malli Malli Nuvve) పాటని విడుదల చేశారు. ఈ పాటను అక్కినేని అభిమానులు (Akkineni Fans) ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. మొదటిసారిగా, అఖిల్ అక్కినేని ఈ పాట విడుదల నిమిత్తం ట్విట్టర్ స్పేస్‌ (Twitter Space)లో అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యారు.

Akhil-1.jpg

పాట విషయానికి వస్తే.. ఇప్పటికే ప్రోమోతో ఆసక్తి రేపిన ఈ పాట.. ఫుల్ సాంగ్ మరింతగా శ్రోతలని ఆకట్టుకుంటోంది. ఈ ఫుట్-ట్యాపింగ్ నంబర్‌ కి క్లాసిసిజం టింజ్ ఉంది. మైల్డ్ బాస్ వర్క్ పాట‌కు హైలైట్. హిప్-హాప్ తమిళ (Hip Hop Thamizha) వినగానే ఆకట్టుకునే నెంబర్‌ని కంపోజ్ చేశారు. పాటలో వినిపించిన ఇంగ్లీష్ ర్యాప్‌ మరింత ఇంపాక్ట్‌ని జోడిస్తుంది. అలాగే అఖిల్ ఈ పాటలో అల్ట్రా-స్టైలిష్‌గా కనిపించారు. లవ్లీ ఎక్స్‌ప్రెషన్స్, ఎట్రాక్టివ్ డ్యాన్స్ మూవ్స్‌తో ఆకట్టుకున్నారు. సాక్షి వైద్య (Sakshi Vaidya) అందంగా కనిపించింది. లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ కట్టిపడేసేలా ఉంది. బ్యూటీఫుల్ ఫారిన్ లొకేషన్స్‌లో రూపొందించిన పాటలోని విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి.

‘‘మళ్లీ మళ్లీ నువ్వే ఎదురెదురొస్తే.. థట్స్ ఏ సైన్ అని మనసంటుందే..

నా లేటెస్ట్ మిషనవి నువ్వే.. సాధించాలనిపిస్తుందే..

పిల్లా నీ వల్లే దిల్ లా.. ధక్ ధక్ ఏంటో పెరిగేనిలా..

నీలో ఇక చూడలా.. జరుగునులేదో ఈ మాయ..

అది లవ్వో.. నీ నవ్వో.. అయ్యా రోమియో.. ఓ అమ్మాయో.. ’’ అంటూ సాగిన ఈ పాటకు ఆదిత్య అయ్యంగార్ (Aditya Iyengar) సాహిత్యం అందించగా.. సంగీత దర్శకుడైన హిప్-హాప్ తమిళనే పాటని ఆలపించారు. కాగా.. దర్శకుడు సురేందర్ రెడ్డి మునుపెన్నడూ చూడని అవతార్, క్యారెక్టర్‌లో అఖిల్‌ని ప్రెజెంట్ చేస్తున్నారు. మమ్ముట్టి (Mammootty) కీలక పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రానికి కథను వక్కంతం వంశీ అందించారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ (AK Entertainments), సురేందర్ 2 సినిమా (Surender 2 Cinema) పతాకాలపై రామబ్రహ్మం సుంకర (Ramabrahmam Sunkara) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

*********************************

Meena: ‘శుభలగ్నం’ రీమేక్ చేస్తే చేయాలనుకున్నా.. కానీ?


Sir: దర్శకుడే కారణం.. చిరు చెప్పిందే మూర్తిగారు చెప్పారు

Premi Viswanath: అరుదైన వ్యాధి.. ‘కార్తీకదీపం’ వంటలక్క కూడా ఆ బ్యాచ్‌లోకి!

Ram Charan: ఆ ఘనత అందుకున్న తొలి తెలుగు హీరోగా రికార్డ్


Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-02-22T20:38:30+05:30 IST

News Hub