Spyware in apps: రిస్క్‌లో లక్షలాది మంది ఆండ్రాయిడ్ యూజర్లు.. గూగుల్ ప్లే స్టోర్‌లోని 100కిపైగా యాప్స్‌లో స్పైవేర్ గుర్తింపు

ABN , First Publish Date - 2023-06-05T17:28:28+05:30 IST

ఆండ్రాయిడ్ ఫోన్ (Android users) యూజర్లకు బిగ్ అలర్ట్!.. మినీ-గేమ్‌గా డిజైన్ చేసిన ఒక ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ మాడ్యూల్ ప్రమాదకరమైన ‘స్పైవేర్’ (spyware) అని తేలింది. ఈ స్పైవేర్ మొబైల్ ఫోన్లలో నిక్షిప్తమయ్యి ఉన్న ఫైల్స్‌ నుంచి సమాచారాన్ని సేకరిస్తోంది. అంతేకాదు అవసరమైతే సైబర్ నేరగాళ్లకు ఈ సమాచారాన్ని చేరవేసే సామర్థ్యాన్ని కలిగివుంది.

Spyware in apps: రిస్క్‌లో లక్షలాది మంది ఆండ్రాయిడ్ యూజర్లు.. గూగుల్ ప్లే స్టోర్‌లోని 100కిపైగా యాప్స్‌లో స్పైవేర్ గుర్తింపు

ఆండ్రాయిడ్ ఫోన్ (Android users) యూజర్లకు బిగ్ అలర్ట్!.. మినీ-గేమ్‌గా డిజైన్ చేసిన ఒక ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ మాడ్యూల్ ప్రమాదకరమైన ‘స్పైవేర్’ (spyware) అని తేలింది. ఈ స్పైవేర్ మొబైల్ ఫోన్లలో నిక్షిప్తమయ్యి ఉన్న ఫైల్స్‌ నుంచి సమాచారాన్ని సేకరిస్తోంది. అంతేకాదు అవసరమైతే సైబర్ నేరగాళ్లకు ఈ సమాచారాన్ని చేరవేసే సామర్థ్యాన్ని కలిగివుంది. మొత్తం 100కిపైగా యాప్స్‌లో ఈ స్పైవేర్‌ను నేరగాళ్లు పొందుపరిచినట్టు మాల్‌వేర్ అనలిస్టులు చెబుతున్నారు.

ఈ మాల్‌వేర్ ఉన్న యాప్‌ల పెద్ద సంఖ్యలో డౌన్‌లోడ్‌ అయ్యాయని, ఇప్పటివరకు 420 మిలియన్లుపైగా ఇన్‌స్టాల్స్ జరిగాయని యాంటీ వైరస్ కంపెనీ ‘డా వెబ్’ (Dr Web) రిపోర్ట్ పేర్కొంది. ఆండ్రాయిడ్.స్పై.స్పిన్ఓకేగా (Android.Spy.SpinOk) పేర్కొంటున్న ఈ స్పైవేర్‌ను మార్కెటింగ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కిట్‌గా (SDK) డిస్ట్రిబ్యూట్ చేశారు. అంటే.. డెవలపర్స్ దీనిని గూగుల్ ప్లే స్టోర్‌లో లభ్యమయ్యే యాప్స్ సహా అన్ని తరహా యాప్‌లు, గేమ్స్‌లో ప్రవేశపెట్టవచ్చు. ‘‘ మినీ-గేమ్స్, సిస్టమ్ ఆఫ్ టాస్క్స్, ప్రైజులు, రివార్డుల సాయంతో యాప్స్‌పై కనిపించేలా ఈ స్పిన్ఓకే మాడ్యూల్‌ను రూపొందించారు. ఒక్కసారి యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్నాక ఎస్‌డీకే (సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కిట్) సీఅండ్‌సీ సర్వర్‌తో కనెక్టవుతుంది. తద్వారా ప్రభావిత డివైజ్ నుంచి పెద్ద మొత్తంలో డేటాను చేరవేసే అవకాశాలున్నాయి.

ఈ మాల్‌వేర్ ఏవిధంగా పనిచేస్తుందోనని విశ్లేషించగా షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. డిజైస్ సెట్టింగులతో సంబంధం లేకుండా ఇది పనిచేస్తోంది. సర్వర్ నుంచి మాడ్యూల్‌ యూఆర్ఎల్స్ రిసీవ్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఇవి వెబ్‌వ్యూలో ఓపెన్ అవుతున్నాయి. తద్వారా ప్రకటనల బ్యానర్లుగా ఫోన్లపై డిస్‌ప్లే అయ్యేలా సైబర్ క్రిమినల్స్ స్పైవేర్‌ను రూపొందించారని తేలింది.

Updated Date - 2023-06-05T17:28:48+05:30 IST