SiddhuJonnalagadda: కొత్త సినిమా, కొత్త దర్శకుడు

ABN , First Publish Date - 2023-02-07T12:41:31+05:30 IST

ఇప్పుడు వస్తున్న యువ నటుల్లో సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) మంచి విజయాలతో వరుస దూసుకుపోతున్నాడు. అతని సినిమా 'డీజే టిల్లు' (DJ Tillu) పెద్ద విజయం సాధించటం తో సిద్ధుకి మంచి క్రేజ్ రావటంతో సినిమాలు చెయ్యడానికి నిర్మాతలు చాలామంది ముందుకు వస్తున్నారు.

SiddhuJonnalagadda: కొత్త సినిమా, కొత్త దర్శకుడు

ఇప్పుడు వస్తున్న యువ నటుల్లో సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) మంచి విజయాలతో వరుస దూసుకుపోతున్నాడు. అతని సినిమా 'డీజే టిల్లు' (DJ Tillu) పెద్ద విజయం సాధించటం తో సిద్ధుకి మంచి క్రేజ్ రావటంతో సినిమాలు చెయ్యడానికి నిర్మాతలు చాలామంది ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం ''డీజే టిల్లు' సినిమాకి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ (Tillu sqaure) అనే సినిమాతో బిజీ గా వున్నాడు. ఈరోజు అంటే ఫిబ్రవరి 7, సిద్దు పుట్టినరోజు, ఈ సందర్భంగా నిర్మాత బివిఎస్సెన్ ప్రసాద్ (BVSN Prasad) తన శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ మీద ఒక సినిమా ప్రకటించారు. ఈ సినిమాతో వైష్ణవి అనే కొత్త దర్శకురాలు పరిచయం అవుతోంది.

djtillu2.jpg

ఈ సినిమాని, సుకుమార్ రైటింగ్స్ (Sukumar Writings) తో కలిపి తీస్తున్నట్టుగా కూడా ప్రకటించారు. సిద్ధు సినిమాలకి ఒక ప్లస్ పాయింట్ కూడా వుంది. ఏంటి అంటే తన సినిమా కథలని సిద్ధు తయారుచేసుకుంటారు, అలాగే దర్శకుడితో పాటు కథ, కథనం ఎలా ఉండాలి అనే విషయం లో ఒక చర్చ మొదలెట్టి అందరికి ఆమోదయోగ్యమయ్యే విధంగా తయారుచేసుకుంటారు. మొదటి నుండి తన సినిమాలకి కథలు తనే తయారుచేసుకున్నాడు, ఎందుకంటే అతను అంత విజయం సాధించాడు అని అంటారు. ఇప్పుడు విజయాల బాటలో వున్నాడు కాబట్టి, సిద్ధు కూడా తన పారితోషికాన్ని పెంచినట్టు భోగట్టా వినపడుతోంది.

The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-02-07T12:48:02+05:30 IST