Bank Holidays: వరుసగా 4 రోజులు బ్యాంకులకు సెలవా..? జనవరి 30, 31 తారీఖుల్లో బ్యాంకులు పనిచేయవా..?
ABN , First Publish Date - 2023-01-28T17:27:30+05:30 IST
ఈ నెల 30, 31వ తారీఖుల్లో దేశ వ్యాప్తంగా సమ్మె చేయాలని బ్యాంకు ఉద్యోగులు భావించారు. ఈ కారణంగా జనవరి నెల చివరి నాలుగు రోజులు బ్యాంకులు పనిచేయవని

బ్యాంకులకు సెలవులు అనేమాట వింటే చాలు కస్టమర్ ల గుండెల్లో గుబులు పుడుతుంది. నిజానికి ఇప్పట్లో చాలామంది మొబైల్ లోనే ఆర్థిక కార్యకలాపాలు సాగించినా నగరాలు దాటి చిన్న పట్టణాలు, మండల ప్రాంతాలకు వెళితే నేరుగా బ్యాంకుకు వెళ్ళి పనులు చక్కబెట్టుకునేవారు ఎక్కువ. బ్యాంకులకు సెలవు అనేమాట వీరికి కంగారు పుట్టిస్తుంది. వాస్తవానికి ఈ నెల 30, 31వ తారీఖుల్లో దేశ వ్యాప్తంగా సమ్మె చేయాలని బ్యాంకు ఉద్యోగులు భావించారు. ఈ కారణంగా జనవరి నెల చివరి నాలుగు రోజులు బ్యాంకులు పనిచేయవని వస్తున్న వార్తల నేపథ్యంలో నిజంగానే బ్యాంకులు నెలచివర దుకాణం మూసేస్తాయా అనే సమాచారం మీకోసం..
బ్యాంక్ యానియన్లు కొన్ని విషయాలను ప్రస్తావించి తమ డిమాండ్స్ ను నెరవేర్చాలని లేని పక్షంలో తాము బ్యాంక్ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తూ విధులు నిర్వహించడం ఆపి సమ్మె చేపడతామని పిలుపునిచ్చాయి. ఈ డిమాండ్స్ లో.. వారంలో అయిదు రోజులు మాత్రమే పని ఉండాలనేది వీరి మొదటి డిమాండ్, అలాగే ఉద్యోగస్తులు సరిపడినంతమంది లేకపోవడం వల్ల విధులు నిర్వర్తిస్తున్నవారికి అదనపు పనిభారం పడుతుంది. అందుకే అన్ని తరగతుల ఉద్యోగస్తులను తగినంత ఉండేలా నియమించాలని కోరుతున్నాయి. ఇక పెన్షన్ విషయంలో పాత పెన్షన్ స్కీమ్ ను పునరుద్దించి, కొత్త పెన్షన్ స్కీమ్ ను రద్దు చేయాలని తెలిపాయి. ఈ డిమాండ్స్ నేపథ్యంలో బ్యాంక్ యూనియన్లు అన్నీ కలిసి సమ్మెకు పిలుపు ఇచ్చాయి.
ఈనెల29 చివరి శనివారం, 30వతేదీ ఆదివారం కాగా 30,31తేదీలైన సోమ, మంగళ వారాల్లో సమ్మె కారణంగా బ్యాంకులు పనిచేయవని అందరూ అనుకుంటున్నారు. అయితే ఇదంతా ఇప్పుడు జరగడం లేదని తెలిసింది. బ్యాంకులు సోమ, మంగళ వారాల్లో(అంటే 30,31తేదీలలో) నిక్షేపంగా పనిచేస్తాయని కబురొచ్చింది. సమ్మెను వాయిదా వేసుకుంటూ తాజాగా నిర్ణయం తీసుకోవడమే బ్యాంకు తలుపులు తెరుచుకోవడానికి కారణమట. ఏది ఏమైనా బ్యాంక్ లావాదేవీలు చేసుకోవాల్సి ఉంటే పుకార్లు విని పనులు మానుకోకండి.