Share News

Blue Tea: బాన పొట్ట.. యమా వేగంగా కరిగించే బ్లూ టీ.. అసలు దీన్ని దేంతో తయారు చేస్తారో తెలిస్తే..!

ABN , First Publish Date - 2023-11-14T16:22:35+05:30 IST

ఈ టీ తాగితే బాన పొట్ట అయినా సరే వేగంగా కరిగిపోతుంది. అంతేకాదండోయ్ వయసు పెరిగినా వృద్దాప్యం దరిచేరదు.

Blue Tea: బాన పొట్ట.. యమా వేగంగా కరిగించే బ్లూ టీ.. అసలు దీన్ని దేంతో తయారు చేస్తారో తెలిస్తే..!

అందంగా నాజూగ్గా కనిపించాలని అందరికీ ఉంటుంది. కానీ లైఫ్ స్టైల్ కారణంగా ఫిట్నెస్ చాలా వరకు పాడైపోతుంది. వేళకాని వేళకు తినడం, బయట ఆహారాలు, శారీరక వ్యాయామం తగినంత లేకపోవడం, ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం వంటి కారణాల వల్ల పొట్ట ఏర్పడుతుంది. దీనికారణంగా లావు లేని వారు కూడా చాలా లావుగా కనబడతారు. చాలామంది కేవలం ఈ పొట్ట కొవ్వు కరిగించడానికే అష్టకష్టాలు పడుతుంటారు. అయితే బాన పొట్టను అయినా సరే వేగంగా కరిగించే టీ ఒకటుంది. అదే బ్లూ టీ(blue tea). నీలం రంగులో ఉండటం వల్ల దీన్ని బ్లూ టీ అని పిలుస్తారు. ఈ బ్లూ టీ ని అపరాజిత పుష్పాలతో చేస్తారు. ఈ పువ్వులనే చాలా చోట్ల శంఖు పువ్వులని కూడా అంటారు. ఈ టీ ఎలా చేసుకోవాలి? దీనివల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుంటే..

బరువు తగ్గడానికి(weight loss) శంకు పువ్వుల టీ చాలా మంచిది. ఈ పువ్వులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ డయాబెటిక్ లక్షణాలు సమృద్దిగా ఉన్నాయి. ఇవి శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి.

ఇది కూడా చదవండి: Liver Damage: ఈ 4 లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా.. లివర్ పాడవుతున్నట్టే లెక్క.. నిద్ర పోయినప్పుడు ఇలా జరిగితే..!



బ్లూ టీ తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. ఇది వేగంగా బరువు తగ్గడానికి దారితీస్తుంది. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. బ్లూ టీ తయారు చేసుకోవడానికి 4 నుండి 5 నీలి రంగు శంఖు పువ్వులను నీటిలో వేసి ఉడికించాలి. ఆ తరువాత వడగట్టుకుని అభిరుచి కొద్దీ తేనె, నిమ్మరసం కలిపి తీసుకోవాలి. ఇది నీలిరంగులో చాలా ఆహ్లాదంగా ఉంటుంది.

అధిక కొలెస్ట్రాల్(high cholesterol) ను తగ్గించడంలో బ్లూ టీ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. గుండె జబ్బుల(heart problems) ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మహిళలలో పీరియడ్స్(periods) రెగ్యులర్ గా రానివారికి ఈ టీ చాలా మేలు చేస్తుంది.

బ్లూ టీ బెస్ట్ యాంటీ ఏజింగ్(anti aging). దీన్ని తాగేవారికి వయసు పెరిగినా వృద్దాప్యం దరిచేరదు. దీన్ని తాగడం వల్ల ముడతలు, మచ్చలు తగ్గుతాయి. వృద్దాప్య ఛాయలు క్రమంగా కనుమరుగవుతాయి. ముఖానికి మెరుపును ఇస్తుంది.

ఇది కూడా చదవండి: Home Making: వంటింట్లో ఇలాంటి పురుగులు కనిపిస్తున్నాయా..? ఈ 5 ట్రిక్స్‌లో దేన్ని వాడినా ఇవన్నీ మటాష్..!


Updated Date - 2023-11-14T16:22:37+05:30 IST