poisonous Fruits: మనము రోజు తీసుకునే ఆహార పదార్థాల్లో కొన్ని విషపూరితమైనవి తెలుసా..!
ABN , First Publish Date - 2023-03-30T13:06:18+05:30 IST
మన నిత్యజీవితంలో ఎన్నింటిన్నో ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వివిధ రకాల పండ్లు, కూరగాయలని(Fruits and vegetables) మన ఆహారంలో

మన నిత్యజీవితంలో ఎన్నింటిన్నో ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వివిధ రకాల పండ్లు, కూరగాయలని(Fruits and vegetables) మన ఆహారంలో భాగంగా చేసుకున్నాం. అయితే..మనము రోజు తీసుకునే ఆహార పదార్థాల్లో కొన్ని విషపూరితమైనవి(poisonous) తెలుసా. అలాంటి ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. ఆపిల్ పండులో(apple) ఉండే గింజలు అమిక్ డాలిన్ అనే పదార్థాన్ని కలిగి ఉంటాయి. అవి జీర్ణ ఏంజైమ్ లను(digestive enzyme) తాకినప్పుడు సైనేడ్ ను విడుదల చేస్తాయి. ఆపిల్ గింజల్లో కిలో 700 మిల్లి గ్రాముల సైనేడ్ ఉంటుంది. ఇది మానవ శరీరానికి చాలా ప్రమాదకరం. అందుకే ఆపిల్ గింజలకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. బంగాళాదుంపలో(potato) ఆకులు, కాండం మొలకల్లో గ్లైకో ఆల్కొలైడ్స్ అనే విషపూరిత రసాయన సమ్మెళనం ఉంటుంది. బంగాళాదుంపను ఎక్కువ సేసు కాంతిలో ఉంచినట్లయితే అది పెరుగుతుంది.గ్లైకో ఆల్కొలైడ్స్ తినడం వల్ల, తిమ్మిరి, విరోచనాలు చివరికి మరణాలు కూడా సంభవించవచ్చు.
ఆకుపచ్చ వర్ణం కలిగిన బంగాళాదుంపను తినకుండా నివారించడం మంచింది. సూపర్ మార్కెట్ లో లభించే జీడిపప్పు లో నిజానికి ఊరిశియోల్ అనే విషపదార్థం ఉంటాయి. ఇది అధికస్థాయిలో ఉంటే ప్రాణాంతకం అని చెప్పాలి. దీంతో పాటు చేదు బాదం కూడా ప్రాణాంతకమే అంట. న్యూజిలాండ్ లో ఈ చేదు బాదం అమ్మకం చట్టవిరుద్ధం. అందులో కొద్ది మొత్తంలో అమెగ్ డాలిన్ ఉంటుంది. దీన్ని శరీరంలోకి తీసుకున్నప్పుడు సైనేడ్ గా మారిపోతుందట. తేనేటీగల నుంచి నేరుగా తేనే తీసుకోవడం మానవ శరీరానికి అంత మంచిది కాదు. అలా తీసుకోవడం వల్ల ఇది మైకం, బలహీనత, అధిక చమట వికారం, వాంతికి దారి తీస్తుంది. ఏరుపు బీన్స్, సోయాబిన్స్ వల్ల అనారోగ్య సమస్యలు రావొచ్చు. దీన్ని సరిగ్గా ఉడికించుకోకుండా తింటే కడుపులో నొప్పి, వాంతులు అయ్యే అవకాశం ఉంటుంది.
ఈ రెండు బీన్స్ ని కనీసం 12 గంటలు నానబెట్టి, ఉడకబెట్టి తినాలి. మసాలలో ఎక్కువగా ఉపయోగించే జాజికాయలు వాడితే.. అనేక రకమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అధిక పరిమాణంలో తీసుకుంటే వికారం నొప్పి, శ్వాస సమస్యలు, మూర్చతో పాటు మానసిక సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉంది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన చీస్ ఏంటంటే.. ఖాజూ మార్జూ చీజ్. దీనికి సంబంధించి ఆసక్తికరమైన విషయం లోపల పురుగులు ఉండటం. ఒకవేళ లోపల ఉన్న పురుగులు చనిపోతే.. చీజ్ చేడిపోయిందని అర్థం. ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు తింటే కడుపులో అసౌకర్యంగా ఉంటే వాంతులు, విరోచనాలు వచ్చే అవకాశం ఉంటుంది. పైన చెప్పుకున్నవి తిని అనారోగ్యం పాలైన సంఘటనలు అరుదుగానే ఉన్నా..వాటి వాడకంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.