Health Tips: రుద్రాక్షలను అందరూ మెడలో ధరిస్తుంటారు.. కానీ ఇలా ఉపయోగిస్తే ఎన్ని లాభాలో..
ABN , First Publish Date - 2023-08-07T10:52:44+05:30 IST
రుద్రాక్షలను కేవలం మెడలో ధరించడమే అందరికీ తెలుసు. దీనివల్ల బోలెడు ఫలితాలని కూడా తెలుసు. కానీ ఈ రెండు విధాలుగా రుద్రాక్ష ఉపయోగిస్తే ఫలితాలు చూసి ఆశ్చర్యపోతారు..
రుద్రాక్షకు హిందూ ధర్మానికి పెద్ద సంబంధమే ఉంది. శివుడి కంటి నుండి జారిపడిన కన్నీళ్ళే రుద్రాక్షలని పురాణాలు చెబుతున్నాయి. రుద్రాక్షలను ఆద్యాత్మిక సాధనలోనూ, దీక్షలలోనూ ధరిస్తుంటారు. రుద్రాక్షలలో ఉన్న శక్తి ఫలితంగా అవి మానసికంగానూ, శారీరకంగానూ అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. రుద్రాక్ష పండ్లు మొదట ఆకుపచ్చ రంగులో, ఆ తరువాత ముదురు నీలం రంగులో.. చివరగా గోధుమ రంగులోకి మారుతుంది. అయితే రుద్రాక్షలను కేవలం మెడలో ధరించడమే అందరికీ తెలుసు. 108రుద్రాక్షలు కలిగిన హారాన్ని మెడలో ధరించడం వల్ల అది రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. కానీ మరొక రెండు విధాలుగా రుద్రాక్షలను ఉపయోగించవచ్చు. ఇలా ఉపయోగించడం వల్ల ఊహించని ఆరోగ్య ఫలితాలు సొంతమవుతాయి. అవేంటో తెలుసుకుంటే..
రుద్రాక్షలను కేవలం మెడలో ధరించడమే కాదు మరొక రెండు విధాలుగా కూడా ఉపయోగించవచ్చు.
1) రుద్రాక్ష నీటిని తాగడం..(Rudraksha soaked water)
రుద్రాక్ష నీటిని తాగడం వల్ల బోలెడు ఆరోగ్య ఫలితాలున్నాయి. రుద్రాక్షను రాత్రి సమయంలో నీటిలో వేసి ఉంచాలి. ఉదయాన్నే రుద్రాక్షను నీటినుండి బయటకు తీసి ఆ నీటిని తాగాలి. పరగడుపునే ఈ నీటిని తాగడం వల్ల కంట్రోల్ లో లేని రక్తపోటు కూడా అదుపులోకి వస్తుంది. గుండె కొట్టుకునే వేగం సాదారణమవుతుంది. రుద్రాక్ష నీటిని తాగడం వల్ల జలుబు, దగ్గు సమస్యలు సులువుగా తగ్గుతాయి. ఇది యోగాలో జలనేతితో పోల్చబడుతుంది. రుద్రాక్ష నీటిని గాయాల ఇన్ఫెక్షన్ల మీద కూడా పూతగా వేయచ్చు. దీనివల్ల గాయాలు, పుండ్లు తొందరగా తగ్గుతాయి. కండ్ల కలక, కళ్ళు మంటలు, దృష్టిలోపం ఉన్నప్పుడు రుద్రాక్ష నీటిని కళ్లలో వేసుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. రుద్రాక్ష వల్ల థైరాయిడ్, టాన్సిల్స్ వ్యాధులలో ఉపశమనం లభిస్తుంది. ఫైల్స్, కాలేయం, కామెర్లు, ఇతర కడుపు సంబంధిత వ్యాధులలో కూడా రుద్రాక్ష శక్తివంతంగా పనిచేస్తుంది.
రుద్రాక్షను సౌందర్య సాధనంగా కూడా ఉపయోగిస్తున్నారు. రుద్రాక్ష పొడి, గంధం పొడి, కొబ్బరినూనె మూండింటిని కలిపి కాలిన గాయాలమీద రాస్తే తొందరగా తగ్గిపోతాయి. రుద్రాక్ష పొడి కలిపిన నీటితో స్నానం చేస్తే చర్మం మెరుస్తుంది. చర్మ సంబంధ సమస్యలన్నీ తగ్గుతాయి. రుద్రాక్ష పొడి, మంజిష్ట పొడి, తేనె,నెయ్యతో కలిపి పేస్ట్ తయారుచేసి దీన్ని ఫేస్ మాస్క్ వేసుకుంటే ముఖం చందమామలాగా తయారవుతుంది.
Health tips: నోటిపుండ్లు వచ్చినప్పుడు తొందరగా తగ్గిపోవాలంటే ఈ 6 పొరపాట్లు అస్సలు చేయకండి..
2) రుద్రాక్షలను తలపై ధరించడం..
సాధారణంగా బుషులు, సన్యాసులు తలపైన రుద్రాక్షలు ధరిస్తుంటారు. దీనివెనుక చాలా ఆశ్చర్యపరిచే నిజాలు తెలిశాయి. తలపైన రుద్రాక్షలను ధరించడం వల్ల ఎంతో వేధించే డిప్రెషన్ కూడా నయమవుతుంది. రుద్రాక్షలు ఏకాగ్రతను, దృష్టిని, మానసిక శక్తిని పెంచుతాయి. 11ముఖాల రుద్రాక్షను దారంతో కట్టి దాన్ని తలపై ధరిస్తే తలనొప్పి, మైగ్రేన్ నయమవుతాయి. మెదడులోని డోపమైన్, సెరోటోనిన్ హార్మోన్ల స్థాయి మెరుగ్గా ఉండటమే ఇందుకు కారణం. మూర్చరోగులు రుద్రాక్షను తలమీద ధరిస్తే చాలా ప్రయోజకరంగా ఉంటుంది. సెల్ ఫోన్ల నుండి వెలువడే రేడియేషన్ ను కూడా రుద్రాక్షలు తగ్గిస్తాయి. ఇవి గొప్ప యాంటీఏజింగ్ ప్రభావాన్ని శరీరం మీద కలిగిస్తాయి. అందుకే రుద్రాక్షలు ధరించేవారు యవ్వనంగా ఉంటారు.