Health Tips: బరువు తగ్గడం కష్టంగా అనిపిస్తోందా?.. ఉదయం లేవగానే ఇదొక్కటి తాగి చూడండి..
ABN , First Publish Date - 2023-10-08T12:09:01+05:30 IST
ఉదయాన్నే ఈ ఒక్కటీ తాగడం వల్ల అధికబరువుతో పాటు పొట్టలో కొవ్వు, కడుపు ఉబ్బరం అన్నీ మంత్రించినట్టు మాయం అవుతాయి.
అధిక బరువు ఎన్నోఆరోగ్య సమస్యలకు ప్రధాన శత్రువు. ఆరోగ్య స్పృహ పెరిగేకొద్ది బరువు తగ్గడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందుకోసం జిమ్ లో కసరత్తుల నుండి కడుపు మాడ్చుకోవడం, యోగా, ఇతర వ్యాయామాలు కూడా చేస్తుంటారు. కానీ ఫలితాలు తక్కువగా ఉంటాయి. చాలామందికి బరువు తగ్గడం అంటే కష్టంగా ఉంటుంది. అలాంటివారికి అద్భుతమైన చిట్కా ఉంది. ఉదయాన్నే దీన్ని తాగడం వల్ల అధికబరువుతో పాటు పొట్టలో కొవ్వు, కడుపు ఉబ్బరం అన్నీ మంత్రించినట్టు మాయం అవుతాయి. అంత అద్బుతమైన డ్రింగ్ ఏంటో తెలుసుకుంటే..
బరువు తగ్గడంలో(Weight loss) గణనీయమైన ఫలితాలు పొందిన చాలామంది ఉపయోగించిన అద్బుతమైన పదార్థం చియా సీడ్స్(chia seeds). ఇవి బరువు తగ్గించడంలో మంచి ఫలితాలు ఇస్తాయి. చియా సీడ్స్ ను ఉదయాన్నే తీసుకోవడం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ ఎక్కువ సేపు ఉంటుంది. దీని కారణంగా ఇది కడుపులో కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. చియా గింజలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను నెమ్మదిగా జరిగేలా చేస్తుంది. ఈ కారణంగా రక్తంలో గ్లూకోజ్ ఆలస్యంగా విడుదల అవుతుంది. ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.
Viral News: ఎవరీ రాంబాబు..? ఒకప్పుడు రోజు కూలీగా పనిచేసిన ఈ కుర్రాడే.. నేడు దేశం ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాడు..!
బరువు తగ్గాలని అనుకునేవారు ఒక స్పూన్ చియా గింజలను ఒక గ్లాసు నీటిలో కలిపి రాత్రంతా నానబెట్టాలి(over night socked chia seeds). ఉదయం నిద్రలేచిన తరువాత ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగాలి. రుచికోసం ఇందుకో కాసింత నిమ్మరసం, తేనె కూడా కలుపుకోవచ్చు. ఈ డ్రింక్ తాగడం వల్ల కేవలం వారం రోజుల లోపే బరువులో మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా పొట్ట కొవ్వు తగ్గడంలో మంచి ఫలితాలు ఇస్తుంది.