Health Tips: చెప్పులు లేకుండా నడవడం మంచిదా..? వేసుకుని నడిస్తే మంచిదా..? దేని వల్ల ఎక్కువ లాభమంటే..!
ABN , First Publish Date - 2023-08-23T12:38:39+05:30 IST
అసలు వాకింగ్ ఎలా చేయాలి? చాలామంది ఉత్త కాళ్ళతో వాకింగ్ చేస్తుంటారు. మరికొందరు చెప్పులు లేదా షూస్ వేసుకుంటారు. వాకింగ్ వల్ల ఎక్కువ లాభాలు చేకూరాలంటే ఎలా నడవడం మంచిదంటే..
నడక ఆరోగ్యానికి చాలామంచిది. ఎలాంటి ప్రత్యేక పరికరాలు లేకుండా ఏ వయసు వారైనా నిరభ్యరంతంగా చేయగలిగిన వ్యాయామం నడక. ఎక్కువ మంది కూర్చుని చేసే ఉద్యోగాలు చేస్తుండం వల్ల ఉదయమో, సాయంత్రమో కొద్దిసేపు నడవడం మంచిదని, నడక పూర్తీ శరీరానికి ఆరోగ్యం చేకూర్చుతుందని ఫిట్ నెస్ నిపుణుల నుండి ఆరోగ్య నిపుణుల వరకు అందరూ చెబుతారు. అయితే వాకింగ్ ఎలా చేయాలి? చాలామంది ఉత్త కాళ్ళతో వాకింగ్ చేస్తుంటారు. మరికొందరు చెప్పులు లేదా షూస్ వేసుకుంటారు. వాకింగ్ వల్ల ఎక్కువ లాభాలు చేకూరాలంటే ఎలా నడవడం మంచిదో తెలుసుకుంటే..
నడక చాలా శక్తివంతమైన వ్యాయామం. ఇది పూర్తీ శరీరాన్ని దృఢంగా ఉంచడంలో సహాయపడుతుంది. చాలామంది వాకింగ్ అనగానే వాకింగ్ షూస్, మెత్తని చెప్పులు కొనమని సలహాలు ఇస్తుంటారు. మరికొందరు వీటిని ఫాలో అవుతుంటారు. ఇవి వాకింగ్ చెయ్యడానికి చాలా అనుకూలంగా ఉంటాయని అంటుంటారు. కానీ వాకింగ్ వల్ల లాభాలు చేకూరాలి అంటే అసలు చెప్పులే అవసరం లేదంటున్నారు(walking without slippers). చెప్పులు లేకుండా నడవడాన్ని గ్రౌండింగ్(Grounding)లేదా ఎర్తింగ్(earthing) అని పిలుస్తారు. చెప్పులు వేసుకుని నడవడం కంటే చెప్పులు లేకుండా నడిస్తే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా చెప్పులు లేకుండా నడిస్తే గుండె ఆరోగ్యం మెరుగవుతుంది(Increase Heart Health). మెరుగైన రక్తప్రసరణకు, మెరుగైన హృదయ స్పందన రేటుకు ఇది కారణమవుతుంది. భూమిలోని విద్యుదయస్కాంత క్షేత్రం మనిషి శరీరంతో సంకర్షణ చెందుతుంది. దీని ఫలితంగా నాడీవ్యవస్థ సమతుల్యం అవుతుంది.
Baby First Haircut: మొట్టమొదటిసారి హెయిర్ కటింగ్.. సెలూన్‌లో ఈ పిల్లాడి రియాక్షన్స్ ఎలా ఉన్నాయో మీరే చూడండి..!
భూమి ఉపరితలంపై ఎలక్ట్రాన్ల సరఫరా చాలా ఉంటుంది. చెప్పులు లేకుండా నడిచినప్పుడు ఇవి శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇవి శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్ ను నాశనం చేస్తాయి. ఫ్రీరాడికల్స్ ఎెక్కువగా ఉన్నవారి శరీరం తరచూ మంట, నొప్పికి గురవుతూ ఉంటుంది. ఇలాంటి వారికి చెప్పులు లేకుండా నడవడం బాగా ఉపకరిస్తుంది. ప్రతిరోజూ ఈ నడక ఫాలో అయితే ఎన్నో నెలలు, ఏళ్ళ తరబడి వేధిస్తున్న సమస్యలు కూడా తగ్గుతాయి.
నిద్రలేమి, మానసిక ఒత్తిడి వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారికి చెప్పులు లేని నడక మంత్రంలా పనిచేస్తుంది. ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు కారిస్టాల్ హార్మోన్ ఎక్కువగా విడుదల అవుతుంది. ఇది ఆహారం ఎక్కువ తీసుకోవడానికి, బరువు పెరగడానికి, నిద్రలేమికి కారణమవుతుంది. ఈ హార్మోన్ చెప్పుల్లేని నడక ద్వారా నియంత్రించబడుతుంది. శరీరంలో సిర్కాడియన్ రిథమ్ సిస్టమ్ ఉంటుంది. ఇది శరీరానికి సహజ గడియారంలా పనిచేస్తుంది. ఈ వ్యవస్థ దెబ్బతినడం వల్ల నిద్రకు ఆటంకాలు ఏర్పడుతుంటాయి. చెప్పుల్లేకుండా నడిస్తే ఈ వ్యవస్థ నియంత్రణలోకి వస్తుంది. నిరాశ, నిస్పృహ, ఆందోళన వంటి మానసిక సమస్యలు కూడా కేవలం చెప్పుల్లేకుండా నడవడం వల్ల తగ్గుతాయి.