Viral Video: ఇండిగో విమానంలో సింగర్ సప్నా చౌదరి ఏం చేసిందంటే...
ABN , First Publish Date - 2023-04-21T13:17:05+05:30 IST
ఓ ప్రముఖ గాయకురాలి విమానంలో 37వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తూ పాట పాడుతూ తోటి ప్రయాణికులతో కలిసి డాన్స్ చేసిన ఘటన సంచలనం....
న్యూఢిల్లీ: ఓ ప్రముఖ గాయకురాలి విమానంలో 37వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తూ పాట పాడుతూ తోటి ప్రయాణికులతో కలిసి డాన్స్ చేసిన ఘటన సంచలనం రేపింది. ప్రముఖ హర్యానా గాయకురాలు సప్నా చౌదరి విమాన ప్రయాణంలో పాట పాడుతూ తోటి విమాన ప్రయాణికులతో కలిసి డాన్స్ చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.తేరీ ఆఖ్యా కా యో కాజల్ అనే హర్యానా పాటకు సప్నా చౌదరితో కలిసి విమాన ప్రయాణీకులు డ్యాన్స్ చేస్తున్న వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియో ఆరు రోజుల క్రితం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘సప్నా చౌదరి పాట గాలిలో 37,000 అడుగుల ఎత్తులో ఎలా హిట్ అవుతుంది’’ అనే శీర్షికతో ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేశారు.ఈ వీడియోలో ప్రయాణికులతో కలిసి సప్నా చౌదరి నృత్యం చేస్తుండగా, ప్రయాణికుల వెనుక యాంకర్ జే కర్మాణి బూమ్‌బాక్స్‌పై బిగ్గరగా పాటను ప్లే చేయడం చూడవచ్చు.
ఇది కూడా చదవండి : Poonch terror attack: ఫూంచ్ ఉగ్రదాడిలో చైనా, పాకిస్థాన్ దేశాల పాత్ర?
జే కర్మాణి వీడియోను షేర్ చేశారు.ఈ వీడియో ఇప్పుడు 38 వేలకు పైగా నెటిజన్లు వీక్షించారు.వేలాదిమంది లైక్‌లు కొట్టారు. ఈ వీడియోకు సోషల్ మీడియా కొందరు సంతోషం వ్యక్తం చేశారు. మరికొందరు ప్రయాణికులు,విమానాల భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘సప్నా చౌదరి విమానంలో డాన్స్ చేయడానికి ఎలా అనుమతించారు... ఇది ప్రమాదకరం కాదా?’’ అని కొందరు నెటిజన్లు ప్రశ్నించారు. విమాన ప్రయాణ సమయంలో డ్యాన్స్ చేయడం ప్రమాదకరమని గమనించాలి. విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు సీటుపై కూర్చోని ప్రయాణించాలి. విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో భద్రతా పరికరాలను ఉపయోగించని కారణంగా కొందరు వ్యక్తులు గాయపడిన సంఘటనలు గతంలో జరిగాయి. విమాన ప్రయాణీకులు తమ నడుముకు సీటు బెల్టును కట్టుకోవడం చాలా ముఖ్యం.అలాంటిది డాన్స్ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.