KalatapasviViswanath: సాగరసంగమంలో జయప్రదకి ముందు ఈమెని అనుకున్నారట...
ABN , First Publish Date - 2023-02-20T09:44:21+05:30 IST
కమల్ హాసన్ సరసం జయప్రద (Jayaprada) కథానాయికగా నటించింది ఇందులో. జయప్రద అద్భుతమయిన పేరు తెచ్చుకుంది 'సాగర సంగమం' సినిమాలో. ఆమె తప్ప వేరేవాళ్లు వెయ్యలేరు ఆ రోల్ అనేటట్టుగా చేసింది. అయితే విశ్వనాధ్ గారు ఈ సినిమాకి జయప్రద కన్నా ముందు ఇంకొకరిని అనుకొని, ఆమెకి అడ్వాన్స్ కూడా ఇచ్చారట.
కళాతపస్వి కె. విశ్వనాధ్ (#KalatapasviViswanath) గారు తీసిన ప్రతి సినిమా మన సంస్కృతి, సంప్రదాయం, ఆచారాలు, అలవాట్లు ఒకటేమిటి అన్నీ కూడా తెలుగు దనానికి పెట్టింది పేరుగా ఉంటాయి. ప్రతి సినిమా నుండి ఎదో ఒకటి నేర్చుకోవచ్చు, అలాగే ఇప్పుడు వస్తున్న యువ దర్శకులకు అతని సినిమాలు ఒక పత్యంసులు లాంటివి. అలంటి విశ్వనాధ్ గారు సంగీతం నేపధ్యం లో తీసిన 'శంకరాభరణం' (#Shankarabharanam) తరువాత నాట్యం ప్రధానాంశముగా వచ్చిన సినిమా 'సాగర సంగమం' (#SagaraSangamam). ఈ సినిమా లో నటించిన కమల్ హాసన్ (Kamal Haasan) కి ఒక స్టార్ గా నిలబెట్టడమే కాకుండా, ఈ సినిమా ఎన్నో అవార్డులు కూడా గెలుచుకుంది.
కమల్ హాసన్ పక్కన జయప్రద (Jayaprada) కథానాయికగా నటించింది ఇందులో. జయప్రద అద్భుతమయిన పేరు తెచ్చుకుంది 'సాగర సంగమం' సినిమాలో. ఆమె తప్ప వేరేవాళ్లు వెయ్యలేరు ఆ రోల్ అనేటట్టుగా చేసింది. అయితే విశ్వనాధ్ గారు ఈ సినిమాకి జయప్రద కన్నా ముందు ఇంకొకరిని అనుకొని, ఆమెకి అడ్వాన్స్ కూడా ఇచ్చారట. ఆమె మరెవరో కాదు, జయసుధ (Jayasudha). "నన్ను ముందుగా ఈ సినిమాకి అనుకొని నాకు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. అయితే కమల్ హాసన్ డేట్స్ వలన ఈ సినిమా కొంచెం ఆలస్యంగా ప్రారంభం అయింది. అప్పటికి నేను రామారావు (NT Rama Rao) గారి సినిమా వొప్పుకొని ఆ సినిమా షూటింగ్ లో పాల్గొనాల్సి వచ్చింది. అందుకని నేను అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసి, సినిమా చెయ్యటం అవదు అని చెప్పేసాను", అని చెప్పారు జయసుధ.
ఆదివారం నాడు కళాతపస్వి విశ్వనాథ్ గారికి కళాంజలి (#KalatapasviKalanjali) అని ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేసినప్పుడు అక్కడికి విచ్చేసిన జయసుధ ఈ మాట చెప్పారు. కానీ ఆలా అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయటం వలన, విశ్వనాధ్ గారు జయసుధ మీద కొంచెం అలక వహించి చాలాకాలం మాట్లాడలేదట. అది కూడా ఆమె చెప్పింది. "కానీ ఆమధ్య ఒకరి నేను విశ్వనాధ్ గారి ఇంటికి వెళ్లి కలిసినప్పుడు నాకు అయన ఒక కథ చెప్పి నాతో నటిస్తావా అని అడిగారు. అయితే అది కార్యరూపం దాల్చలేదు కానీ, ఆయనకి నా మీద కోపం పోయింది అనుకోని సంతోషించాలని," అని చెప్పారు జయసుధ. 'సాగర సంగమం' లో నా స్నేహితురాలు జయప్రద చాల బాగా చేసింది, ఆమె ఆ పాత్రకి కరెక్టు అని అనిపించింది అని చెప్పారు జయసుధ.