Viral: ఆఫీస్ బాత్రూమ్‌లో 10 నిమిషాలు ఉన్న ఉద్యోగిని.. ఆ తర్వాత ఆమె పరిస్థితి ఏమైందో తెలిస్తే షాక్!
ABN , First Publish Date - 2023-07-30T15:52:47+05:30 IST
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఓ మంచి ఉద్యోగాన్ని సంపాదించడం చాలా కష్టం. ఎన్నో నెలలు ప్రయత్నిస్తే తప్ప ఉద్యోగం దొరకదు. అలాంటిది మంచి ఉద్యోగాన్ని కేవలం మూడే రోజుల్లో వదిలేయాల్సి వస్తే ఎలా ఉంటుంది. ఎంత బాధగా ఉంటుంది. తాజాగా ఓ మహిళకు అలాంటి అనుభవమే ఎదురైంది.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఓ మంచి ఉద్యోగాన్ని (Job) సంపాదించడం చాలా కష్టం. ఎన్నో నెలలు ప్రయత్నిస్తే తప్ప ఉద్యోగం దొరకదు. అలాంటిది మంచి ఉద్యోగాన్ని కేవలం మూడే రోజుల్లో వదిలేయాల్సి వస్తే ఎలా ఉంటుంది. ఎంత బాధగా ఉంటుంది. తాజాగా ఓ మహిళకు అలాంటి అనుభవమే ఎదురైంది. ఉద్యోగం దొరికిందనే సంతోషంలో ఉండగానే ఆమె ఆ ఉద్యోగం పోగొట్టుకుంది. ఆమె తన బాధను వివరిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ (Viral Post) అవుతోంది.
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ రెడ్డిట్‌లో వైరల్ అయిన ఈ పోస్ట్‌లో ఓ మహిళా ఉద్యోగిని (Female Employee) తన బాస్ మాటలతో షాకై ఉద్యోగం వదిలేసింది. గత సోమవారం ఆ మహిళ ఓ ప్రముఖ కంపెనీలో చేరింది. బుధవారానికే ఉద్యోగానికి రాజీనామా (Resign) చేయాల్సిందిగా బాస్ ఆమెను ఆదేశించాడు. ``నేను ఏ తప్పూ చేయకపోయినా బాస్ నాపై ఆగ్రహం పెంచుకున్నాడు. నేను బాత్రూమ్‌లో 10 నిమిషాల కంటే ఎక్కువ ఉంటున్నానని అన్నాడు. నేను ఓ మానసిక వ్యాధిగ్రస్తురాలిని అన్నాడు. ఒక ఉద్యోగితో బాస్ అలా ఎలా మాట్లాడతాడు`` అంటూ ఆమె పేర్కొంది.
Viral Video: ఆవు పేడతో మొబైల్ కవర్లు.. ఆ కవర్ల వల్ల అంత పెద్ద ఉపయోగం ఉందా?.. వీడియో వైరల్!
ఉద్యోగానికి రాజీనామా చేయాలని తనను అడిగాడని, తాను కూడా రాజీనామా చేయాలని అనుకున్నానని చెప్పింది. కేవలం మూడ్రోజుల్లో తన గురించి అతడు ఎలా ఓ నిర్ధారణకు వచ్చాడో అర్థం కావడం లేదని, వెనుక ఎదో బలమైన కారణం ఉండి ఉంటుందని ఆ మహిళ అనుమానం వ్యక్తం చేసింది. ఈ మొత్తం ఘటనలో తన తప్పు ఏమైనా ఉందా? అని ప్రశ్నించింది. ఆ మహిళ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.