Jr Ntr: దయ చేసి వారిని ఒత్తిడి చేయకండి.. నా విన్నపం మాత్రమే!
ABN , First Publish Date - 2023-02-06T08:20:21+05:30 IST
‘జై లవకుశ’లో నేను త్రిపాత్రాభినయం చేశా. అలా మూడు పాత్రలు చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఇందులో అన్నయ్య త్రిపాత్రాభినయం చేశారు. అద్భుతంగా నటించారు. తన కెరీర్‌లో ‘అమిగోస్’ మైలురాయిలా నిలుస్తుంది’’ అని జూ.ఎన్టీఆర్ అన్నారు.
‘జై లవకుశ’లో నేను త్రిపాత్రాభినయం చేశా. అలా మూడు పాత్రలు చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఇందులో అన్నయ్య త్రిపాత్రాభినయం చేశారు. అద్భుతంగా నటించారు. తన కెరీర్‌లో ‘అమిగోస్’ మైలురాయిలా నిలుస్తుంది’’ అని జూ.ఎన్టీఆర్ (jr ntr)అన్నారు. నందమూరి కల్యాణ్ (kalyan ram) రామ్ హీరోగా నటించిన చిత్రం ‘అమిగోస్’.(amigos) రాజేంద్రరెడ్డి దర్శకుడు. అనికా రంగనాథ్ కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్ (mythri movie makers)సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఈ సినిమా ఈనెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘‘మా ఇంట్లో ఎంతమంది నటులున్నా.. ఎక్కువ ప్రయోగాలు చేసింది అన్నయ్య కల్యాణ్‌రామే! ఈ చిత్రం ఆయనకు మంచి విజయాన్ని అందిస్తుంది. దర్శకుడు రాజేంద్ర ఇంజినీరింగ్ చేశారు. ఆయన తల్లిదండ్రులు ఉద్యోగం చేసుకోవచ్చు కదరా అంటే.. నేను ఓ సినిమా తెరకెక్కించాకే తిరిగి ఇంటికొస్త్తానని చెప్పారు. కానీ, సినిమా మొదలయ్యే లోపు వాళ్లమ్మ, పూర్తయ్యే లోపు తండ్రి కాలం చేశారు. సినిమా పట్ల ఓ మనిషికి ఇంత ప్రేమ, తాపత్రయం ఉంటుందా అనేది రాజేంద్రను చూశాకే తెలిసింది. మైత్రీ మూవీస్ అంటే నా కుటుంబంతో సమానం. వరుసల విజయాలతో ఉన్న ఆ సంస్థ ఈ చిత్రంతో సక్సెస్ ట్రెండ్ కొనసాగాలని కోరుకుంటున్నా.
వారి కన్నా ముందు మీకే చెబుతాం... (Ntr Comments)
సినిమాల అప్‌డేట్‌లు కావాలని దర్శకనిర్మాతలపై ఒత్తిడి పెంచకండి. ఇది మా విన్నపం మాత్రమే. నిజంగా అదిరిపోయే అప్‌డేట్ ఉంటే మా భార్యల కన్నా ముందు మీతోనే పంచుకుంటాం. నా తదుపరి చిత్రం ఈ నెలలోనే ప్రారంభిస్తాను. మార్చి 20 లేదా ఈలోపే రెగ్యులర్ చిత్రీకరణ మొదలు పెడతాం. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేస్తాం’’ అన్నారు.
హీరో కల్యాణ్ రామ్ మాట్లాడుతూ ‘‘మొదటిసారి మనుషుల్ని పోలిన మనుషుల కథతో ఈ వినూత్నమైన థ్రిల్లర్ ట్రై చేశాం. నాకిలాంటి కథ ఇచ్చినందుకు రాజేంద్రకు థ్యాంక్స్. ‘బింబిసార’ తర్వాత ఎలాంటి చిత్రం చేయాలనుకున్నప్పుడు రాజేంద్ర ఈ కథ తెచ్చారు. కచ్చితంగా ఈ సినిమా ఎవరినీ నిరుత్సాహపరచదు’’ అని అన్నారు.
మాకు హ్యాట్రిక్ పక్కా:నిర్మాతలు
‘‘కల్యాణ్‌రామ్‌తో సినిమా చేయాలని చాలాకాలంగా అనుకుంటున్నాం.ఇప్పటికి నెరవేరింది. ిఅవుట్‌పుట్ చూశాం. చాలా బాగా వచ్చింది. ‘బింబిసారా’ ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. కథ చాలా వైవిఽధ్యంగా ఉంటుంది. ఇది కచ్చితంగా మాకు హ్యాట్రిక్ హిట్‌గా నిలుస్తుందని నమ్ముతున్నాం’’ అన్నారు.