FanWar: ప్రభాస్, మహేష్ అభిమానుల మధ్య యుద్ధం
ABN , First Publish Date - 2023-01-28T15:41:36+05:30 IST
ప్రస్తుతం ఈ వేదిక మీద మహేష్ బాబు(Mahesh Babu fans), ప్రభాస్ (Prabhas fans) అభిమానుల మధ్య తీవ్రమయిన పదజాలంతో కూడిన యుద్ధం జరుగుతోంది. ఎవరూ వెనక్కి తగ్గటం లేదు.
ఈ సాంఘీక మాధ్యమాలు వచ్చాక అసలు ఎవరు ఏమి మాట్లాడుతున్నారో, ఎవరు ఎవరిని ఎందుకు ట్రోల్ చేస్తారో తెలియటం లేదు. ఎవరు మీద అయినా ఏమన్నా అనాలి అనుకున్నా, తిట్టాలన్నా లేదా ఎదో టాగ్ పెట్టి ట్రోల్ చెయ్యాలన్న వీటన్నిటికీ ఈ సాంఘీక మాధ్యమం ఒక వేదిక అయిపోయింది. ముఖ్యంగా స్టార్ ల అభిమానులు ఈ వేదికని ఆధారం చేసుకొని తమ స్టార్ మీద అభిమానం చూపిస్తే బాగుండేది, కానీ అవతలి స్టార్ ని, అభిమానులని ఒకరినొకరు తిట్టుకుంటూ, ఒక విధమయిన నీచ సంస్కృతికి తెర తీస్తున్నారు. వీరంతా నిజమయిన అభిమానులేనా లేదా స్టార్స్ కి అభిమానుల మని చెప్పుకొని కావాలనే స్టార్ ల అభిమానుల మధ్య చీలికలు, జగడాలు పెట్టడానికేనా అన్నట్టుగా వుంది వీరి వాగ్వివాదం.
ప్రస్తుతం ఈ వేదిక మీద మహేష్ బాబు(Mahesh Babu fans), ప్రభాస్ (Prabhas fans) అభిమానుల మధ్య తీవ్రమయిన పదజాలంతో కూడిన యుద్ధం జరుగుతోంది. ఎవరూ వెనక్కి తగ్గటం లేదు. అసలు ఇవన్నీ ఎక్కడ మొదలవుతాయి, ఎక్కడ ఎండ్ అవుతాయో కూడా తెలియటం లేదు. నిజ జీవితం లో మహేష్ బాబు (MBFans), ప్రభాస్ (PBFans) ఇద్దరూ మంచి స్నేహితులే. వాళ్ళిద్దరి మధ్య ఏమి లేదన్న సంగతి వాళ్లిద్దరూ చిరంజీవి (Chiranjeevi) గారితో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి (Chief Minister) జగన్ మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) ని కలిసినప్పుడే అర్థం అయింది కదా.
మరి ఈ అభిమానులము అని చెప్పుకుంటున్న వాళ్ళు ఎందుకు ఇంత నీచమయిన పదజాలంతో కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు? ఇంతకు ముందు కూడా ఇలాగే ఇద్దరి నటుల మధ్య అభిమానులు ఇదే వేదికగా కొట్టుకున్నారు, ఇప్పుడు మహేష్ బాబు, ప్రభాస్ అభిమానులమని చెప్పుకునేవాళ్ళు కొట్టుకుంటున్నారు. మళ్ళీ వీటికి ఒక టాగ్ #NeverMessWithMBFans పెట్టి వైరల్ చెయ్యడం కూడా పరిపాటి అయిపొయింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారు, ప్రభాస్ పెదనాన్న రెబెల్ స్టార్ కృష్ణం రాజు గారు ఇద్దరూ మంచి స్నేహితులు. మరి ఈ అభిమానులకి ఎందుకో ఈ గొడవ అని కొంతమంది ఆవేదన కూడా చెందుతున్నారు. తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ (Ajith Kumar) అందుకే తన అభిమాన సంఘాలు అన్నిటినీ రద్దు చేసేసాడు. అలాగే మిగతా స్టార్స్ కూడా చేస్తే సరిపోయేది.