Ram charan: ఆ సినిమా ఆగిపోలేదు!

ABN , First Publish Date - 2023-02-21T14:37:31+05:30 IST

రామ్‌చరణ్‌ ప్రస్తుతం ‘ఆర్‌సీ15’తో బిజీగా ఉన్నారు. శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇటీవల ఓ షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. చెర్రీ ప్రస్తుతం ఆస్కార్‌ ప్రమోషన్స్‌ కోసం లాస్‌ వేగాస్‌కు పయనమయ్యారు.

Ram charan: ఆ సినిమా ఆగిపోలేదు!

రామ్‌చరణ్‌ (RamCharan) ప్రస్తుతం ‘ఆర్‌సీ15’(RC15)తో బిజీగా ఉన్నారు. శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇటీవల ఓ షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. చెర్రీ ప్రస్తుతం ఆస్కార్‌ ప్రమోషన్స్‌ (Oscar)కోసం లాస్‌ వేగాస్‌కు పయనమయ్యారు. తిరిగొచ్చాక మళ్లీ సెట్‌లో అడుగుపెడతారు. తదుపరి చిత్రంగా బుచ్చిబాబు సానా(BUchibabu saana)తో ఓ సినిమా కమిట్‌ అయ్యారు. దానితోపాటు మరో చిత్రం కూడా చెర్రీ కమిట్‌ అయ్యారని చాలాకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కన్నడలో ‘ముఫ్తీ’ సినిమాతో సూపర్‌హిట్‌ అందుకున్న నర్తన్‌(Narthan) తెలుగులో ఎప్పటి నుంచో సినిమా చేయాలనుకుంటున్నారు. ఫైనల్‌గా రామ్‌చరణ్‌కు కథ చెప్పి ఒప్పించారు. అదే సమయంలో కన్నడ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌తో నర్తన్‌కు ఒక ప్రాజెక్ట్‌ ఓకే అయ్యింది. అతి త్వరలో ఈ సినిమా సెట్స్‌ మీదకెళ్లనుంది. దాంతో చరణ్‌తో సినిమా ఉంటుదా లేదా అన్న చర్చ మొదలైంది. ఆల్మోస్ట్‌ ఈ సినిమా లేనట్లే అన్న వార్తలు కూడా నెట్టింట వైరల్‌ అయ్యాయి. అయితే ఆ వార్తలో నిజం లేదని చరణ్‌ సన్నిహిత వర్గాలు బయటపెట్టాయి. నర్తన్‌తో సినిమా ఉందని, కాస్త సమయం పడుతుందని వారు చెబుతున్నారు. శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్‌సీ15’ పూర్తయిన తర్వాత బుచ్చిబాబు సినిమాని మొదలెడతారు చరణ్‌. ఆ తరవాతే.. నర్తన్‌ సినిమా ఉంటుందట. ఈలోపు నర్తన్‌ శివరాజ్‌ కుమార్‌తో పూర్తి చేసుకుంటారని తెలుస్తోంది. నర్తన్‌తో చరణ్‌ సినిమా ఆగిపోలేదనమాట.

Updated Date - 2023-02-21T14:39:00+05:30 IST

News Hub