Relationship Advice: రాత్రి పడుకునే ముందు భర్తలు ఈ మూడు పనులు చేస్తే చాలు.. భార్యలు ఫుల్లు హ్యాపీ..!
ABN , Publish Date - Dec 15 , 2023 | 01:44 PM
ఎంత ప్రయత్నించినా భార్య సంతోషపడట్లేదా.. ఈ మూడు ఫాలో అయితే హ్యాపీ లైఫ్ పక్కా..
పెళ్లి ప్రతివ్యక్తి జీవితంలో ఎంతో కీలకమైన దశ. తల్లిదండ్రుల దగ్గర అల్లారుముద్దుగా పెరిగిన ఆడపిల్ల వారిని వదిలి భర్తతోనే ఇక జీవితం అనుకుంటుంది. కానీ చాలామంది మహిళలు తమ భర్త దగ్గర ఆశించినంత సంతోషం పొందలేకపోతున్నారనేది నమ్మి తీరాల్సిన విషయం. ఉదయం నుండి ఉద్యోగాలు, ఆ ఉద్యోగం ముగిసి ట్రాఫిక్ లో అలసిపోయి ఇంటికి చేరిన భర్తలు చాలా వరకు 'నాకు అలసటగా ఉంది భోజనం పెడితే తిని పడుకునేస్తా' అని అంటూంటారు. మరికొందరు టీవి చూస్తూ డిస్టర్బ్ చెయ్యద్దని చెబుతారు. అయితే భార్యను సంతోషపెట్టాలంటే భర్తలు రాత్రి పడుకునేముందు తప్పనిసరిగా చెయ్యాల్సిన మూడు పనులున్నాయి. అవి చేస్తే ఎన్ని బహుమతులు ఇచ్చినా రాని సంతోషం భార్యల ముఖంలో కనిపిస్తుంది.
పరామర్మ..
భర్తలు ఉద్యోగాలు చేసి అలసిపోయాం అని అనుకుంటారు. కానీ భార్యలు కూడా ఇంట్లో చాలా పనులు చేసి అలసిపోయి ఉంటారు. వారు ఏదైనా చెప్పాలని అనుకున్నా కొందరు "నాకు వినే ఓపిక లేదు, అలసిపోయాను" అంటుంటారు. కానీ అది తప్పు. ఈ రోజు ఎలా గడిచింది? ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా? సమస్యలేవైనా ఉంటే వాటికి పరిష్కారాలు ఆలోచిద్దాం అంటూ భార్యతో మాట్లాడితే ఆమెకు బోలెడు సంతోషం కలుగుతుంది.
ఇది కూడా చదవండి: పిల్లలు ఉదయాన్నే నిద్రలేస్తే కలిగే లాభాల లిస్ట్ ఇదీ..!
ఇంటి పనులలో సహాయం..
రాత్రి పడుకునే ముందు వంట గది సర్దుకోవడం ప్రతి ఇంట్లో జరిగే టాస్కే. భార్యలు సామాన్లు కడుగుతూ, వంటిల్లు సర్థుతూ ఉంటారు. ఈ సమయంలో భర్తలు టీవి లకు, ఫోన్ లకు అతుక్కుపోకుండా హాల్, పడక గది, పిల్లలను చూసుకోవడం వంటివి చేస్తే భార్యలకు శ్రమ తగ్గుతుంది. నిజానికి డబ్బు, బహుమతులు ఇవ్వడం కంటే ఇలా పనులలో దొరికే సాయం భార్యలకు చాలా తృప్తిని ఇస్తుంది. పనులు తొందరగా అయిపోతే సమస్యలు చర్చించుకునే సమయం కూడా దొరుకుతుంది.
ఇది కూడా చదవండి: నెయ్యిలో నానబెట్టిన ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందంటే..!
చిన్న సర్ఫ్రైజులు..
అలసటలో ఉన్న ఎవరికైనా సరే.. ప్రేమతో కూడిన చిన్న బహుమతులు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. భర్తలు ఆఫీసు ముగిసి ఇంటికెళ్తూ ఓ గులాబీ, ఫుడ్ ఐటమ్, స్వీట్స్, ఆమెకు ఇష్టమైన బుక్స్ ఇలా ఏదో ఒకటి పట్టుకెళ్లినా చాలు.. అది భార్యలకు కోట్ల విలువైన బహుమతిలా అనిపిస్తుంది. భార్య అడిగితే కాదు.. భర్త తనకు తాను ఇచ్చేది ఏదైనా భార్యకు సంతోషాన్నిస్తుంది. పైగా ఇలాంటివి రొమాంటిక్ గా కూడా ఉంటాయి. ఇద్దరి మధ్యా చిన్న అపార్థాలు ఉన్నా మాయమైపోతాయి. ఆమె కోసం భర్త కోసం స్పెషల్ గా ఎదురుచూసేలా చేస్తాయి.
మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి..