Celebrities: పెళ్లిలో సందడి చేసిన సెలబ్రిటీలు

ABN , First Publish Date - 2023-02-11T18:46:49+05:30 IST

సినిమా సెలబ్రిటీలకు రాజస్థాన్ హాట్‌స్పాట్‌గా మారుతుంది. సెలబ్రిటీ లవ్ బర్డ్స్ సిద్దార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra), కియారా అడ్వాణీ (Kiara Advani) జై సల్మీర్‌లోని సూర్యగఢ్‌ కోటలో పెళ్లి చేసుకున్నారు.

Celebrities: పెళ్లిలో సందడి చేసిన సెలబ్రిటీలు

సినిమా సెలబ్రిటీలకు రాజస్థాన్ హాట్‌స్పాట్‌గా మారుతుంది. సెలబ్రిటీ లవ్ బర్డ్స్ సిద్దార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra), కియారా అడ్వాణీ (Kiara Advani) జై సల్మీర్‌లోని సూర్యగఢ్‌ కోటలో పెళ్లి చేసుకున్నారు. తాజాగా మరో వివాహం ఇక్కడే జరిగింది. ఈ వేడుకలో దక్షిణాదితో పాటు బాలీవుడ్‌కు చెందిన సెలబ్రిటీలు సందడి చేశారు.

Akshay-Kumar.jpg

స్టార్ ఇండియా, ద వాల్ట్ డిస్నీ కంపెనీ ఇండియా ప్రెసిడెంట్, ఆసియానెట్ డైరెక్టర్ కె. మహాదేవన్ కుమారుడి పెళ్లి రాజస్థాన్‌లో జరిగింది. ఈ వివాహనికి కమల్ హాసన్, మోహన్ లాల్ (Mohanlal), పృథ్వీరాజ్ సుకుమారన్, ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్, కరణ్ జోహార్ తదితరులు హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. సెలబ్రిటీలందరు ఒకే పిక్‌లో కనిపించడంతో అభిమానులు విపరీతంగా షేర్ చేస్తున్నారు. సంబరాల్లో భాగంగా మోహన్ లాల్, అక్షయ్ కుమార్ భాంగ్రా డ్యాన్స్ చేసి ఆహుతులను ఆశ్చర్యపరిచారు. అందుకు సంబంధించిన వీడియోను అక్షయ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘మోహన్ లాల్‌తో డ్యాన్స్ చేయడం అద్భుతంగా ఉంది. ఈ డ్యాన్స్ నా జీవితాంతం గుర్తుండిపోతుంది’’ అని లాల్ చెప్పారు.

Updated Date - 2023-02-11T18:49:34+05:30 IST