indian railway stations: అవి దేశంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే ప్లాట్‌ఫారాలు... టాప్‌లో ఉన్న రైల్వే స్టేషన్‌లో మొత్తం ఎన్ని ట్రాక్‌లు ఉన్నాయంటే...
ABN , First Publish Date - 2023-03-11T07:41:03+05:30 IST
indian railway stations: భారతీయ రైల్వేలు దేశానికి గుండెకాయ అని అంటారు. దేశ జనాభా(population)లో సగానికి పైగా జనం రైళ్లలో ప్రయాణిస్తుంటారు.

indian railway stations: భారతీయ రైల్వేలు దేశానికి గుండెకాయ అని అంటారు. దేశ జనాభా(population)లో సగానికి పైగా జనం రైళ్లలో ప్రయాణిస్తుంటారు. దేశంలోని రైల్వేలు(Railways) వేగంగా అప్‌డేట్ అవుతున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త రైళ్లను ప్రవేశపెడుతున్నారు. దీనితో పాటు హైస్పీడ్ రైళ్లను(High speed trains) కూడా నడుపుతున్నారు.
అయితే రైలు ప్లాట్‌ఫారమ్(Platform)కు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాల(Interesting stuff) గురించి మీకు తెలుసా? దేశంలో అత్యధిక ప్లాట్‌ఫారాలను కలిగిన రైల్వే స్టేషన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కోల్‌కతా(Kolkata)లోని హౌరా రైల్వే స్టేషన్‌లో అత్యధిక సంఖ్యలో రైల్వే ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి. ఈ స్టేషన్‌లో మొత్తం 23 ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి. ఈ రైల్వే స్టేషన్‌లో 26 ట్రాక్‌ల రైలు మార్గం ఉంది.
దీని తరువాత రెండవ నంబర్‌లో బెంగాల్ రైల్వే స్టేషన్(Bengal Railway Station) ఉంది. బెంగాల్‌లోని సీల్దా రైల్వే స్టేషన్‌లో 20 ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి. ఈ ప్లాట్‌ఫారమ్‌ను అత్యంత రద్దీగా ఉండే ప్లాట్‌ఫారమ్ అని కూడా పిలుస్తారు. ఈ ప్లాట్‌ఫారమ్ నుండి ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులు తమ ప్రయాణాలు సాగిస్తుంటారు.
దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై(Mumbai)లో ఛత్రపతి శివాజీ టెర్మినస్ రైల్వే స్టేషన్‌లో మొత్తం 18 ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని న్యూఢిల్లీ రైల్వే స్టేషన్(New Delhi Railway Station)లో మొత్తం 16 ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి. ఇక్కడ నుండి ప్రతిరోజూ 400 రైళ్లు నడుస్తాయి. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్(Chennai Central Railway Station)లో మొత్తం 15 ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి. ఇక్కడి నుండి ప్రతిరోజూ పలు రైళ్లు నడుస్తాయి.