Pathaan: షా రుఖ్ ఖాన్ దెబ్బకి రెండు సినిమాలు విడుదల వాయిదా

ABN , First Publish Date - 2023-02-01T12:05:35+05:30 IST

'పఠాన్' దెబ్బకు రెండు సినిమాలు తమ విడుదలను వాయిదా వేసుకున్నాయి. విచిత్రం ఏంటి అంటే, అందులో ఒకటి తెలుగు సినిమా 'శాకుంతలం' (Shakuntalam) కూడా ఉండటం. గుణశేఖర్ (Gunasekhar) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత, (Samantha) దేవ్ మోహన్ (Dev Mohan) లు ప్రధాన పాత్రలు పోషించారు.

Pathaan: షా రుఖ్ ఖాన్ దెబ్బకి రెండు సినిమాలు విడుదల వాయిదా

మొన్నటి వరకు దక్షిణాది చిత్రాలు తమ ప్రభావాన్ని చూపిస్తూ ఉండగా, ఇప్పుడు కొన్ని సంవత్సరాల తరువాత షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) తన 'పఠాన్' (Pathaan) తో మొత్తం సినిమా చరిత్రనే మార్చేశాడు. ఇదివరకెన్నడూ లేనంత విధంగా 'పఠాన్' బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తోంది. రికార్డ్స్ (Pathaan creates Records) అన్నీ గల్లంతు అవుతున్నాయి. అబ్బా, చాల సంవత్సరాల తరువాత బాలీవుడ్ లో మళ్ళీ ఒక హిందీ సినిమా ఇంతటి ఘాన విజయం సాధించిందిరా అని అనుకుంటున్నారు, అదీ కాకుండా ఈ విజయం అక్కడ కొత్త ఊపిరిని కూడా నింపింది అని అంటున్నారు. షారుఖ్ మీద ప్రశంసల జల్లులు అందరూ కురిపిస్తున్నారు.

pathaan2.jpg

ఇదిలా ఉంటే, 'పఠాన్' దెబ్బకు రెండు సినిమాలు తమ విడుదలను వాయిదా వేసుకున్నాయి. విచిత్రం ఏంటి అంటే, అందులో ఒకటి తెలుగు సినిమా 'శాకుంతలం' (Shakuntalam) కూడా ఉండటం. గుణశేఖర్ (Gunasekhar) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత, (Samantha) దేవ్ మోహన్ (Dev Mohan) లు ప్రధాన పాత్రలు పోషించారు. ఇది భారతం నుండి తీసుకున్న పౌరాణిక ప్రేమ కథ. ఇది మొత్తం అయిదు భాషల్లో ఈ నెల 17న విడుదల కావాల్సి వుంది, కానీ 'పఠాన్' దెబ్బకి ఇప్పుడు విడుదల వాయిదా వేశారు. కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తారు అని తెలిసింది. అలాగే హిందీ సినిమా 'షెహజాదా' (Shehzada) కూడా విడుదల పోస్టుపోన్ అయింది. ఇదే కారణం అని చెప్తున్నాడు. ఇందులో కార్తీక్ ఆర్యన్ (Kartik Aryan), కృతి సనన్ (Kriti Sanon) లీడ్ పెయిర్ గా చేస్తున్నాడు. ఇది అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన 'ఆలా వైకుంఠపురం లో' (Ala Vaikuntapuram Lo) సినిమాకి రీమేక్.

ఇలా ఈ రెండు సినిమాలు షా రుఖ్ ఖాన్ 'పఠాన్' ప్రభంజనం లో ఎదుర్కొనలేక తమ సినిమాల విడుదల వాయిదా వేసుకోవటమే మంచిది అని వేసుకున్నారు. ఇంకో సినిమా విశ్వక్ సేన్ (Vishwak Sen) నటించి నిర్మిస్తున్న 'ధమ్కీ' (Dhamki) కూడా విడుదల వాయిదా వేసుకున్నారు అని తెలిసింది.

Updated Date - 2023-02-01T12:05:37+05:30 IST