Share News

Raghunandan Rao: రోహింగ్యాలతో హైదరాబాద్‌లో శాంతిభద్రతలకు భంగం: రఘునందన్‌రావు

ABN , Publish Date - Mar 28 , 2025 | 04:37 AM

హైదరాబాద్‌లో అక్రమంగా ఉంటున్న రోహింగ్యాల వల్ల శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు.

Raghunandan Rao: రోహింగ్యాలతో హైదరాబాద్‌లో శాంతిభద్రతలకు భంగం: రఘునందన్‌రావు

న్యూఢిల్లీ, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో అక్రమంగా ఉంటున్న రోహింగ్యాల వల్ల శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. భాగ్యనగరంగా పేరుగాంచిన హైదరాబాద్‌ వారి వల్ల అభాగ్యనగరంగా మారుతుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం లోక్‌సభలో ఇమ్మిగ్రేషన్‌ బిల్లుపై ఎంపీ మాట్లాడారు. చిన్న పట్టణమైన సదాశివపేటలో కూడా జనవరిలో 20 మంది బంగ్లాదేశీయులు అరెస్ట్‌ అయ్యారని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల్లోనూ బంగ్లాదేశీయుల, రోహింగ్యాల అక్రమ చొరబాట్లు పెరిగాయన్నారు. గత యూపీఏ సర్కారు దేశభద్రతను గాలికొదిలేసి రాజకీయం పబ్బం గడుపుకుందని విమర్శించారు.

Updated Date - Mar 28 , 2025 | 04:37 AM