Vidudala Rajini: ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు రజిని
ABN , Publish Date - Mar 28 , 2025 | 04:43 AM
స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి, రూ.2.20 కోట్లు వసూలు చేశారనే ఆరోపణలతో నమోదైన ఏసీబీ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వైసీపీ...

అమరావతి, మార్చి 27(ఆంధ్రజ్యోతి): స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి, రూ.2.20 కోట్లు వసూలు చేశారనే ఆరోపణలతో నమోదైన ఏసీబీ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజిని వేసిన పిటిషన్ గురువారం హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు సమర్పించాలని న్యాయస్థానం ఏసీబీ అధికారులను ఆదేశించింది. విచారణను ఏప్రిల్ 2కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు ఉత్తర్వులు ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో విజిలెన్స్ తనిఖీల పేరుతో తనను బెదిరించి, రూ.2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారని పల్నాడు జిల్లా యడ్లపాడులోని లక్ష్మీబాలాజి స్టోన్ క్రషర్స్‌కు చెందిన నల్లపనేని చలపతిరావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రజినిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ రజిని హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది దుష్యంత్‌రెడ్డి వాదనలు వినిపించారు.