Viral News: బద్దక రత్న అవార్డు కోసం పోటీలట.. గెలిస్తే రూ.88 వేలు ఇస్తారట.. ఇంతకీ రూల్స్ ఏంటో తెలిస్తే..!

ABN , First Publish Date - 2023-09-15T16:07:05+05:30 IST

బద్దకంగా ఉన్నవాళ్ళను చూస్తే ఎక్కడలేని కోపం వస్తుంది. కానీ అక్కడ మాత్రం బద్దకస్తులను తిట్టరు, విసిగించుకోరు. మనిషిలో ఉన్న బద్దకం లెవల్స్ చూసి బద్దకరత్న అవార్డు ఇస్తారు. అవార్డుతో పాటు 88వేలరూపాయలు చక్కగా చేతిలోపెట్టి పంపుతారు.

Viral News: బద్దక రత్న అవార్డు కోసం పోటీలట.. గెలిస్తే రూ.88 వేలు ఇస్తారట.. ఇంతకీ రూల్స్ ఏంటో తెలిస్తే..!

బద్దకం అనే మాట వింటేనే చాలా విసుగు వస్తుంది. పక్కకు కదలకుండా అన్ని పనులను ఇతరులకు పురమాయిస్తుంటారు. ప్రతీది ముందుకు తెచ్చి అమర్చమని అడుగుతారు. ఇలా బద్దకంగా ఉన్నవాళ్ళను చూస్తే ఎక్కడలేని కోపం వస్తుంది. కానీ అక్కడ మాత్రం బద్దకస్తులను తిట్టరు, విసిగించుకోరు. మనిషిలో ఉన్న బద్దకం లెవల్స్ చూసి బద్దకరత్న అవార్డు ఇస్తారు. అవార్డుతో పాటు 88వేలరూపాయలు చక్కగా చేతిలోపెట్టి పంపుతారు. వినడానికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది కానీ ఇది నిజం. అసలింతకూ ఈ పోటీ ఎక్కడ జరుగుతోంది? దీని రూల్స్ ఏంటి? పూర్తీగా తెలుసుుకుంటే..

కష్టపడితేనే డబ్బు సంపాదించగలం అని అంటారు. కానీ బద్దకం వల్ల కూడా డబ్బులొస్తున్నాయండోయ్. ఒకటి రెండు వేలు కాదు.. ఏకంగా 88వేల రూపాయలు కేవలం బద్దకం వల్ల సంపాదించవచ్చు. ఆగ్నేయ ఐరోఫాలో మోంటెనెగ్రో అనే దేశం ఉంది. ఈ దేశానికి ఉత్తరాన బ్రెజ్నా అనే రిసార్డ్ లాంటి గ్రామం ఉంది. ఈ గ్రామంలో ప్రతి సంవత్సరం 'అత్యంత సోమరిపోతు ఎవరు?(Laziest award competition)' అనే పోటీ పెడుతున్నారు. దీన్ని 12ఏళ్లనుండి ప్రతి సంవత్సరం ఆగస్టు నెల మధ్యలో నిర్వహిస్తున్నారు. ఇది ఒకటి రెండు రోజులతో ముగిసే పోటీ కాదు. సుమారు నెలరోజుల పాటు ఈ పోటీ కొనసాగుతుంది. ఇదొక బిగ్ బాస్ టైప్ లో నెలరోజుల పాటు నిర్వహించే పోటీ. ఈ పోటీలో పాల్గొనేవారు చేయాల్సిన ముఖ్యమైన పని నిద్రపోవడం. గంట రెండు గంటలు కాదు, ఒక రోజు రెండు రోజులు కాదు. ఏకంగా పోటీ జరిగే నెలరోజులూ పడుకునే ఉండాలి. ఫోన్ మాట్లాడుతున్నా, ల్యాప్ ట్యాప్ చూస్తున్నా, తింటున్నా, తాగుతున్నా కూడా పడుకునే చేయాలి(all works in sleeping mode). ప్రతి 8గంటలకు ఒకసారి మాత్రం టాయిలెట్ కు వెళ్ళడానికి 10నిమిషాల సమయం ఇస్తారు. ఆ సమయం ముగిసిన తరువాత మళ్లీ పడకెక్కి పడుకోవడమే.

Marriage Tips: అమ్మాయిలూ.. పెళ్లి చూపుల్లోనే అబ్బాయిని ఈ ప్రశ్న అడిగేయండి.. ఇలా చెప్పినోళ్లనే పెళ్లాడండి..!



ఈ పోటీలో సుమారు 21మంది పాల్గొన్నారట. ఎక్కువసేపు పడుకోలేక ఫెయిల్ అయ్యేవారు ఎలిమినేషన్ అయినట్టే. అలా 26రోజుల నుండి చాలామంది ఎలిమినేషన్ అయిపోయి కేవలం 7మంది మిగిలారు. ఇప్పుడు వీరిలో చాలా తీవ్రస్థాయిలో పోటీ కొనసాగుతోంది. చాలామంది తమలో ఉన్న బద్దకాన్ని మొత్తం బయటకు వ్యక్తం చేసి అవార్డు గెలవాలని ప్రయత్నిస్తున్నారు. చివరి ఏడాది ఈ పోటీలో పాల్గొని గెలిచిన వ్యక్తి 117గంటలు నిద్రపోయాడట. అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నవారు 'మాకు ఇక్కడ ఎలాంటి అసౌకర్యం లేదు పోటీ నిర్వాహకులు మమ్మల్ని చాలాబాగా చూసుకుంటున్నారు' అని అంటున్నారు. అన్నిరోజులనుండి అంత సేపు పడుకుంటున్నా వీళ్ళకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకపోవడం విచిత్రం.

Snake Video: చిన్న పామే అని తేలిగ్గా తీసుకోవద్దండోయ్.. అంత పెద్ద గుడ్డును.. ఈ చిన్న పాము ఎలా మింగేసిందో చూస్తే..!


Updated Date - 2023-09-15T16:07:05+05:30 IST