Viral Video: నెట్టింట్లో వైరల్ అవుతున్న చిన్నారి డ్యాన్స్ వీడియో. ఫ్యూచర్ హీరోయిన్ అంటూ ఒకటే ప్రశంసలు.

ABN , First Publish Date - 2023-05-11T13:53:03+05:30 IST

పెద్ద డ్యాన్సర్ లకు ఏమాత్రం తీసిపోకుండా ఎక్స్పెషన్స్ తో చంపేస్తున్న ఈ పాప

Viral Video: నెట్టింట్లో వైరల్ అవుతున్న చిన్నారి డ్యాన్స్ వీడియో. ఫ్యూచర్ హీరోయిన్ అంటూ ఒకటే ప్రశంసలు.

'పిట్ట కొంచెం కూత ఘనం' అనే మాట వినే ఉంటారు. ఈ పాపకు ఆ మాట బాగా సెట్ అవుతుంది. సోషల్ మీడియాలో ఓ చిన్నారి వీడియో వైరల్ అవుతోంది. ఈ పాప డ్యాన్స్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 'వామ్మో ఈ పాప కచ్చితంగా ఫ్యూచర్ లో హీరోయిన్ అవుతుంది' అని జోస్యం చెబుతున్నారు . పెద్ద డ్యాన్సర్ లకు ఏమాత్రం తీసిపోకుండా ఎక్స్పెషన్స్ తో చంపేస్తున్న ఈ పాప సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియో గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

పిల్లలు ఏదైనా తొందరగా నేర్చుకునే స్వభావం(speed learning) కలిగి ఉంటారు. దానికి తగ్గట్టు ఇప్పట్లో పిల్లలకు ప్రోత్సాహం(encourage) కూడా బానే ఉంటోంది. దీంతో పిల్లల ప్రతిభ చాలా తొందరగా బయటపడుతుంది. సోషల్ మీడియా పుణ్యమా అని పిల్లల ట్యాలెంట్ చాలా తొందరగా వైరల్ అవుతుంది. ఓ చిన్న పాప(small girl) డ్యాన్స్ వీడియో ఇప్పుడు అలాగే వైరల్ అవుతోంది. ఓ పాప తన స్కూల్లో డ్యాన్స్ టీచర్ డ్యాన్స్ నేర్పిస్తోంటే తను డ్యాన్స్ ప్రాక్టీస్(baby dance practice) చేస్తోంది. యూనిఫామ్ లో, తన తోటి విద్యార్థులతో కలసి ఎవర్ గ్రీన్ అనే పంజాబీ(evergreen Punjabi song) పాటకు డ్యాన్స్ వేస్తోంది. డ్యాన్స్ వేస్తోన్న సమయంలో పాప మూవ్స్, ముఖంలో ఎక్స్ప్రెషన్స్(moves and face expressions) చూస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేరు. ఆ పాప ఉత్సాహంగా డ్యాన్స్ చూస్తోంటే డాన్స్ అంటే ఇష్టం లేనివారు కూడా కాలు కదుపుతారేమో అన్నట్టు ఉంది.

Hot Water: ఆరోగ్యానికి మంచిది కదా అని వేడినీరు తాగుతున్నారా? ఇన్ని సమస్యలు ముంచుకొస్తాయని తెలిస్తే..


allidoisfun అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్Instagram account) నుండి ఈ వీడియో షేర్ చేశారు. పంజాబీ పాటను బట్టి ఈ పాప పంజాబ్ కు చెందినదిగా భావిస్తున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ పాప డ్యాన్స్ కు ఫిదా అవుతున్నారు. 'అమ్మబాబోయ్ ఆ ఎక్స్ఫ్రెషన్స్ ఏంటి అదిరిపోలా..' అంటున్నారు. 'డౌటే లేదు ఈ పాప కచ్చితంగా ప్యూచర్ లో హీరోయిన్ అవుతుంది' అని మరికొందరు జోస్యం చెబుతున్నారు. 'చూసేకొద్ది చూడాలని అనిపిస్తోంది, ఎంత ముద్దుగా డ్యాన్స్ వేస్తోందో' అని మురిసిపోతున్నారు. మొత్తానికి ఈ పాప తన డ్యాన్స్ తో నెటిజన్ల హృదయాలు దోచేసింది.

Viral News: రాత్రి సమయం ప్రియురాలి ఇంట్లో దూరి ఓ ప్రియుడి నిర్వాకం.. అతడిమీద కోపంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తే జరిగిందిదీ..


Updated Date - 2023-05-11T17:42:01+05:30 IST