Viral Video: చెట్టుపైన కుర్రాడు.. చెట్టు కింద ఓ యువతి.. గుడ్లను చోరీ చేస్తోంటే సడన్‌గా ఎంట్రీ ఇచ్చిన నెమలి.. చివరకు..!

ABN , First Publish Date - 2023-04-18T22:10:26+05:30 IST

అక్కడ జరిగిన సంఘటన చూసిన నెటిజన్లు 'వామ్మో నెమలిలో ఈ యాంగిల్ ఎప్పుడూ చూడలేదు..' అంటున్నారు

Viral Video: చెట్టుపైన కుర్రాడు.. చెట్టు కింద ఓ యువతి.. గుడ్లను చోరీ చేస్తోంటే సడన్‌గా ఎంట్రీ ఇచ్చిన నెమలి.. చివరకు..!

మనుషులకు తమ బిడ్డల మీద ఎంత ప్రేమ ఉంటుందో.. అంతకంటే ఎక్కువ ప్రేమ జంతువులకు, పక్షులకు వాటి పిల్లల మీద ఉంటుంది. అక్కడక్కడా కనిపించే సంఘటనలు, సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోలు ఇందుకు చక్కని ఉదాహరణ. ఇప్పుడు అలాంటి సంఘటన మరొకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. తను ఎంతో కష్టపడి గూడు కట్టుకుని గుడ్లు పెడితే.. ఓ జంట వాటిని దొంగిలించాలని చూశారు. అప్పుడే ఊహించని విధంగా నెమలి అక్కడికి వచ్చింది . అక్కడ జరిగిన సంఘటన చూసిన నెటిజన్లు 'వామ్మో నెమలిలో ఈ యాంగిల్ ఎప్పుడూ చూడలేదు..' అంటున్నారు. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

పక్షుల గుడ్లు దొంగిలించడం చాలా చోట్ల జరుగుతూ ఉంటుంది. కొన్ని పక్షుల గుడ్లకు ధర ఎక్కువగా ఉంటుంది. చాలా అరుదుగా లభించడమే అధిక ధర ఉండటానికి కారణం. ఇలా అరుదుగా దొరికే వాటిలో నెమలి గుడ్లు(Peacock eggs) కూడా ఉంటాయి. ఓ నెమలి చెట్టు మీద గుడ్లు పెట్టింది. ఈ సంగతి ఓ జంటకు తెలిసింది. వారు ఆ గుడ్లను దొంగిలించాలని(theft eggs) అనుకున్నారు. నెమలి ఆ చెట్టు దరిదాపుల్లో లేని సమయం చూసి చెట్టు దగ్గరకు వెళ్ళారు. ఇద్దరిలో కుర్రాడు చెట్టెక్కి గుడ్లు తీసి కిందకు వేస్తున్నాడు. కింద నిలబడుకున్న అమ్మాయి గుడ్లను తన చున్నీలో వేసుకుంటోంది. సరిగ్గా అదే సమయంలో నెమలి ఎంట్రీ ఇచ్చింది. 'నేను పెట్టిన గుడ్లను దొంగిలించడానికి మీకెంత ధైర్యం' అనే ఫీలింగ్ తో ఆవేశంగా చెట్టుమీద ఉన్న కుర్రాడిపై దాడిచేసింది. ఆ కుర్రాడు నెమలి దాడికి భయపడిపోయాడు. తన బలం కొద్దీ నెమలిని కిందకు విసిరేశాడు. ఆ విసురుకు నెమలి కింద ఉన్న అమ్మాయి మీద పడింది. అమ్మాయి తను పట్టుకున్న గుడ్లను కిందకు విడిచిపెట్టేసింది. ఆ తరువాత కూడా నెమలి ఆ అమ్మాయి మీద దాడి చేసినట్టే అనిపించింది.

Viral News: 48 ఏళ్ల వయసులో ఓ వ్యక్తి షాకింగ్ నిర్ణయం.. హిజ్రాను వివాహం చేసుకుని ఊరందరికీ పెళ్లి విందు..!


ఈ వీడియోను The Figen అనే ట్విట్టర్ అకౌంట్ నుండి పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు నెమలి చేసిన పనిని మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. 'ఏ పక్షి ఇతరులు తన గుడ్లను టచ్ చేస్తే సహించలేదు' అని అంటున్నారు. 'ఆ జంటకు నెమలి తగిన శాస్తి చేసింది' అని మరికొందరు అన్నారు. 'మనిషికి ఎప్పుడూ పక్కవాడిని దోచుకోవడమే పని' అని మరికొందరు పంచులు వేశారు.

AC, Cooler ఏదీ అక్కర్లేదు.. ఈ సింపుల్ టిప్స్‌ను పాటిస్తే చాలు.. ఇల్లంతా యమా కూల్..!


Updated Date - 2023-04-18T22:10:26+05:30 IST