Viral Video: ఇలాంటి ప్రేయసి దక్కినందుకు అతడు నిజంగా అదృష్టవంతుడంటూ.. నెటిజన్ల ప్రశంసలకు కారణమేంటంటే..!

ABN , First Publish Date - 2023-09-21T14:22:08+05:30 IST

తన ప్రియుడి విషయంలో ఓ అమ్మాయి చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ అమ్మాయిని ఒకటే పొగిడేస్తున్నారు.

Viral Video: ఇలాంటి ప్రేయసి దక్కినందుకు అతడు నిజంగా అదృష్టవంతుడంటూ.. నెటిజన్ల ప్రశంసలకు కారణమేంటంటే..!

ఈ ప్రపంచంలో ప్రేమ చాలా ప్రత్యేకమైనది. కొందరు తమ భాగస్వాములను చాలా ఎక్కువగా ప్రేమిస్తుంటారు. దాన్ని తమ ప్రవర్తనలో వ్యక్తం చేస్తుంటారు. తిన్నావా, తాగావా అని అడగడం నుండి ఆరోగ్యం వరకు ఎన్నో విషయాల గురించి ఆలోచిస్తుంటారు. చాలా కేరింగ్ గా ఉంటారు. తన ప్రియుడి విషయంలో ఓ అమ్మాయి చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ అమ్మాయిని ఒకటే పొగిడేస్తున్నారు. 'నువ్వు చాలా అదృష్టం చేసుకున్నావు బ్రో' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

ఒకప్పుడు ప్రేమికుల మధ్య వ్యవహారాలు అన్నీ చాటుమాటుగా జరిగేవి. కానీ ఇప్పుడు అలా కాదు. ఏకంగా సోషల్ మీడియోలో ప్రేమికుల మధ్య రొమాన్స్ నుండి వారు ఒకరి గురించి మరొకరు తీసుకునే కేరింగ్ వరకు అన్నీ పోస్ట్ చేస్తుంటారు. ఇప్పుడు ఒక వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో ఒక అమ్మాయి కారు దగ్గరకు నడుస్తూ వస్తుంది. ఆమె చేతిలో పెద్ద ప్రోటీన్ పౌడర్ డబ్బా ఉంది. ఆమె కారు ఎక్కి ఆ డబ్బాను తన బాయ్ ఫ్రెండ్ కు బహుమతిగా ఇస్తుంది. ఆ డబ్బాను అందుకున్న ఆమె బాయ్ ఫ్రెండ్ సంతోషంతో ఆమెను కౌగిలించుకుని ఆమె నుదుటిమీద ముద్దు పెడతాడు. సాధారణంగా ప్రేమికులు ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకుంటూ ఉంటారు. ఇలాంటి బహుమతులలో చాలావరకు సంతోషం కలిగించేవి తప్ప ఉపయోగపడేవి ఏమీ ఉండవు. కానీ ఈ అమ్మాయి మాత్రం తన బాయ్ ఫ్రెండ్ ను ఫిట్నెస్ వైపు దృష్టి మరల్చేలా చెయ్యాలని, అతన్ని జిమ్ కు పంపే ఉద్దేశంతో ప్రోటీన్ పౌడర్ కొనిపెట్టింది(Girl friend gift protein powder . బ్రాస్లెట్లు, ఇతర గిప్టుల కంటే ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం మంచిదనే ఉద్దేశంతో ఆమె అలా చేసిందట.

Husband: జాబ్ మానేసి చదువుకుంటున్నా సరే.. మాజీ భార్యకు డబ్బులు పంపాల్సిందే.. కోర్టుకెళ్లిన మాజీ భర్తకు షాకిచ్చిన హైకోర్టు..!


ABN ఛానల్ ఫాలో అవ్వండి

ఈ వీడియోను fitness_fashion_by_zyzztony అనే ఇన్స్టాగ్రామ్(Instagram) అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమె చేసిన పనిని మెచ్చుకుంటున్నారు. తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 'జిమ్ కు వెళ్ళమని ఆమె ప్రోటీన్ పౌడర ఇచ్చింది సరే.. అతని అలారం మోగిందా లేదా?' అని ఒకరు కామెంట్ చేశారు. 'ఆమె చాలా కేరింగ్ పర్సన్, ఆమెను జీవితంలో ఎప్పటికీ వదులుకోవద్దు బ్రో' అని మరొకరు కామెంట్ చేశారు. 'నువ్వు జీవితంలో గెలుస్తున్నావ్ భయ్యా! అంతగా కేరింగ్ తీసుకునేవారు జీవితంలో దొరకడం అదృష్టం' అని ఇంకొకరు కామెంట్ చేశారు.

Viral Video: అమ్మ బాబోయ్.. సినిమాల్లోనే ఇలాంటి సీన్లు చూసుంటారు.. జింకపై ఓ చిరుత ఎలా అటాక్ చేసిందో చూస్తే..!


Updated Date - 2023-09-21T14:22:08+05:30 IST