Weight Loss: కష్టపడకూడదు.. కానీ బరువు మాత్రం తగ్గిపోవాలంటే.. ఈ 5 ట్రిక్స్‌ను పాటిస్తే సరి..!
ABN , First Publish Date - 2023-08-18T16:33:16+05:30 IST
బరువు తగ్గాలని, తాము కూడా స్లిమ్ గా మారిపోయి చలాకీగా జింక పిల్లలా పరుగులు పెట్టాలని అందరికీ అనిపిస్తుంది. కానీ డైటింగ్ చేయలేక, జిమ్ లో కష్టపడలేక నిరాశ పడుతుంటారు. అలాంటి వారికోసమే ఈ సింపుల్ టిప్స్.
అధిక బరువు మనిషి ఫీలింగ్స్ ను కూడా బరువుగా మార్చేస్తుంది. చాలావరకు అధికబరువున్నవారిలో కోపం, చిరాకు, అసహనం, ఏదైనా పని చేయాలంటే విసుగు. ఎక్కడికైనా వెళ్లాలంటే బద్దకం కనిపిస్తుంటాయి. అటు తిండి దగ్గర నోరు కట్టేసుకుని డైటింగ్ మైంటైన్ చేయలేరు, ఇటు బరువు తగ్గించుకోవడానికి జిమ్ కు వెళ్ళి కష్టపడలేరు. కానీ బరువు తగ్గాలని, తాము కూడా స్లిమ్ గా మారిపోయి చలాకీగా జింక పిల్లలా పరుగులు పెట్టాలని అనుకుంటారు. చాలామంది ఇలాంటి ఆలోచనలను పగటి కలలు అని కొట్టిపడేస్తుంటారు. కానీ ఇప్పుడు అలా నిరుత్సాహపడక్కర్లేదు. జిమ్ కు వెళ్లక్కర్లేకుండా, ప్రత్యేకమైన డైట్ ఫాలో అవ్వకుండా ఈజీగా బరువు తగ్గచ్చు. అందుకోసం చేయాల్సిందల్లా కింద చెప్పుకునే టిక్స్ ఫాలో అవ్వడమే..
బరువు తగ్గాలని అనుకునేవారు దాల్చినచెక్క టీ(cinnamon tea) ట్రై చెయ్యవచ్చు. ఇందులో యాంటీ బాక్టీరియల్, యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇక దాల్చిన చెక్క టీలో తీపికోసం తేనెను ఉపయోగిస్తారు. ఈ రెండింటి కలయిక చాలా అద్భుతమైనది. ఇందులో సిన్నమాల్డిహైడ్ అనే సమ్మేళనం ఏర్పడుతుంది. ఇది థర్మోజెనిసిస్ ను యాక్టివేట్ చేస్తుంది. థర్మోజెనిసిన్ అనేది శరీరంలో ఉష్ణోగ్రత పుట్టించే ప్రక్రియ. శరీరంలో పుట్టే ఉష్ణోగ్రత కేలరీలను బర్న్ చేస్తుంది. ఉదయాన్నే దాల్చిన చెక్క టీ తీసుకోవడం వల్ల అధికబరువును తగ్గిస్తుంది.
వెల్లుల్లి(garlic) గురించి అందరికీ తెలిసిందే. వెల్లుల్లిలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, ప్రోటీన్, మాంగనీస్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ప్రతిరోజు వెల్లుల్లిని వీలైనంతగా ఆహారంలో చేర్చుకుంటే ఇది పొట్టభాగంలో పేరుకున్న కొవ్వును కరిగిస్తుంది.
Health Tips: రాత్రి అన్నం తినేముందు, తిన్న తర్వాత.. ఏం చేయాలి..? ఏమేం పనులు అస్సలు చేయకూడదంటే..!
బరువు తగ్గడానికి చాలామంది ఎన్నో టిప్స్ ఫాలో అవుతుంటారు కానీ పెరుగు(curd) బరువు తగ్గడానికి సహాయపడుతుందని ఎక్కువమందికి తెలియదు. పెరుగు జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. అందుకే భోజనం చివర పెరుగు తినేలా పద్దతి ఏర్పాటుచేయబడింది. పెరుగులో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, ప్రోటీన్, ప్రోబయోటిక్స్ మొదలైనవి పుష్కలంగా ఉంటాయి. పెరుగు తింటే ఎక్కువ సేపు ఆకలి కంట్రోల్ లో ఉంటుంది.
ఈ మధ్యకాలంలో బరువు తగ్గడానికి తీసుకునే డైట్ లో చియా విత్తనాలు(chia seeds) ప్రముఖ స్థానంలో ఉన్నాయి. చియా విత్తనాల్లో ఫైబర్, విటమిన్లు, పొటాషియం, ఖనిజాలు ఉంటాయి. వీటిలో ఉన్న ఫైబర్ కరుగుతుంది. ఇది నీటిని గ్రహిస్తూ జీర్ణాశయమంతా విస్తరిస్తుంది. చియా విత్తనాలు చాలా తొందరగా కడుపు నిండిన ఫీల్ ఇస్తాయి. దీని వల్ల ఎక్కువసేపు ఆహారం తీసుకోకుండా ఉండగలుగుతారు. దీని కారణంగా బరువు తగ్గడంలో సహాయపడుంది. మరొక్క విషయం ఏమిటంటే చియా విత్తనాలు కూడా శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. ఇది కూడా బరువు తగ్గించడానికి మరొక మార్గం.
బరువు తగ్గడానికి ఎంతో కాలంగా ఫాలో అవుతున్న ఎవర్గ్రీన్ టిప్ తేనె, నిమ్మరసం నీళ్లు(lemon, honey water). ఈ రెండింటి కాంబినేషన్ శరీరంలో టాక్సిన్ లు పేరుకోకుండా చేస్తుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. పొట్టభాగంలో కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, కాసింత తేనె కలిపి ప్రతిరోజు ఉదయమే తీసుకోవాలి.