Wife BirthDay: ఇదెక్కడి చట్టంరా బాబోయ్..తలలు పట్టుకుంటున్న భర్తలు..

ABN , First Publish Date - 2023-02-14T12:08:12+05:30 IST

మీరు మీ భార్య పుట్టిన రోజును ఎప్పుడైన మరిచిపోయారా.. మా బర్త్‎డే(Birth Day) మాకు సరిగా గుర్తుండదు. ఇక భార్య(Wife)ల పుట్టిన రోజు..

Wife BirthDay: ఇదెక్కడి చట్టంరా బాబోయ్..తలలు పట్టుకుంటున్న భర్తలు..

ఇంటర్నెట్ డెస్క్: మీరు మీ భార్య పుట్టిన రోజును ఎప్పుడైన మరిచిపోయారా.. మా బర్త్‎డే(Birth Day) మాకు సరిగా గుర్తుండదు. ఇక భార్య(Wife)ల పుట్టిన రోజు ఎక్కడ గుర్తుంటుంది. ఒక వేళ గుర్తున్నా.. చెప్పకుండా ఉన్నారా..? ఇవన్నీ చేసినా మీరు స్వేచ్ఛగా తిరుగుతున్నారా..? అయితే.. మీరు అదృష్టవంతులే.. ఎందుకంటారా.. మీ భార్య పుట్టిన రోజు మరిచిపోయి కూడా ఇంకా జైలు శిక్ష పడనందుకు. భార్య పుట్టిన రోజు మరిచిపోవడం నేరం అనే దేశం ఉంది. అయితే.. పైన చెప్పిన ఇంట్రో(Intro) అంతా దాని గురించే..భార్య పుట్టిన రోజు మరిచిపోతే ఐదేళ్ల జైలు శిక్ష(Five years imprisonment) కూడా వేసే బంపరాఫర్ కూడా ఆ దేశంలో ఉంది.

ఈ విచిత్ర చట్టం అమలు చేస్తున్న దేశం పేరు ‘‘సమోవా’’(SAMOA) అనే ద్వీప దేశం ప్రపంచ(world) వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ ద్వీప దేశంలో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ఇక్కడ తన భర్త, భార్య పుట్టిన రోజును మరిచిపోతే పెద్ద నేరంగా పరిగణిస్తారు. భార్య పుట్టిన రోజును మొదటి సారి మరిచిపోతే వార్నింగ్. రెండవసారి కూడా మరిచిపోతే జరిమానా లేదా జైలుకు వెళ్లే ఛాన్స్ ఉంటుంది. దీనికి మరో ఆఫర్ ఏంటంటే..విసుగొచ్చిన ఆ అర్ధాంగి పోలీసులకు గనుక ఫిర్యాదు చేస్తే.. ఆ భర్తకు ఐదేళ్లు చిప్పకూడే పాపం. ఆ దేశంలో భర్తల గురించి ఆలోచిస్తే జాలివేస్తుందని అంటున్నారు నెటిజన్లు. అయినా ప్రతి ఏడాది గుర్తుంచుకోవడానికి ఏమైనా దేశానికి స్వాతంత్ర్యం(Independence) వచ్చిన తేదీనా అంటూ కొందరు ఫ్రస్టేట్ భర్తలు వాపోతున్నారు. ఇక వారితో పోల్చుకుంటే మాత్రం మనం చాలా లక్కీ బ్రదర్. భార్య పుట్టిన రోజే కాదు..పెళ్లి రోజు మరిచిపోయిన మనలని అడిగే వారే ఉండరు అంటూ..ఈ వార్త తెలిసిన కొందరు భర్తలు సంతోషపడుతున్నారు.

Updated Date - 2023-02-14T12:17:04+05:30 IST