Job Openings For Women: వైట్ కాలర్ ఎకానమీలో పెరిగిన మహిళా భాగస్వామ్యం.. మహమ్మారి తర్వాత చోటుచేసుకున్న మార్పులివే!
ABN , First Publish Date - 2023-03-07T12:14:05+05:30 IST
Job Openings For Women: వర్క్‌ఫోర్స్‌లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడంపై ఇండియా ఇంక్(India Inc.) దృష్టి సారించింది.
Job Openings For Women: వర్క్‌ఫోర్స్‌లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడంపై ఇండియా ఇంక్(India Inc.) దృష్టి సారించింది. దీంతో గత ఏడాది ఫిబ్రవరి(February)తో పోలిస్తే ఈ ఫిబ్రవరిలో వైట్ కాలర్ ఎకానమీ(White Caller Economy)లో మహిళలకు సంబంధించి ఉద్యోగావకాశాలు 35 శాతం పెరిగాయని ఒక నివేదిక(Report) వెల్లడించింది. 2022 ఫిబ్రవరి నెలతో పోలిస్తే మహిళా అభ్యర్థులకు ఉద్యోగాలు 35 శాతం పెరిగాయని ఫిబ్రవరి 2023నాటి గణాంకాలు(Statistics) వెల్లడించాయి.
దీంతో భారతీయ వైట్ కాలర్ ఆర్థిక వ్యవస్థ(economy)లో మహిళా ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతోందని అవగతం అవుతోంది. ఫౌండిట్ (గతంలో మాన్‌స్టర్) నివేదిక APAC అండ్ ME) ఈ వివరాలను వెల్లడించింది. వర్క్‌ఫోర్స్(Workforce)లో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి ఇండియా ఇంక్ చేసిన ఫోకస్డ్ ప్రయత్నాలు సఫలమవుతున్నాని తెలుస్తోంది. మహమ్మారి (pandemic) సమయంలో ఉద్యోగాల నుంచి తప్పుకున్న చాలా మంది ఇప్పుడు తిరిగి ఉద్యోగాల్లో చేరడం ఈ వృద్ధికి కారణమవుతున్నదని నివేదిక పేర్కొంది.
వర్క్‌ఫోర్స్‌లో మహిళల(Womens) భాగస్వామ్యాన్ని పెంచడానికి పలు కంపెనీలు పీరియడ్స్ సెలవులు(Periods holidays), పిల్లల సంరక్షణ తదితర ప్రయోజనాలను పరిచయం చేస్తున్నాయి. ఫిబ్రవరి 2022- ఫిబ్రవరి 2023 మద్యకాలం నాటి ఫౌంటైట్ ప్లాట్‌ఫారమ్‌లోని డేటా ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. వర్క్‌ఫోర్స్‌లో మహిళలకు అత్యధిక డిమాండ్(Demand) ప్రస్తుతం ITES/BPO (36 శాతం) పరిశ్రమలో ఉందని, తర్వాత IT/కంప్యూటర్, సాఫ్ట్‌వేర్ (35 శాతం), బ్యాంకింగ్/అకౌంటింగ్/ఫైనాన్షియల్ సర్వీసెస్ (22 శాతం). భౌగోళిక పంపిణీ పరంగా, మహిళలకు అత్యధిక శాతం ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ఈ జాబితాలో ఢిల్లీ ఎన్‌సిఆర్ (21 శాతం), ముంబై (15 శాతం), బెంగుళూరు (10 శాతం), చెన్నై (9 శాతం) పూణే (7 శాతం) వరుస క్రమంలో ఉన్నాయి.