Street Children Day: పాపం వీధి బాలలు.. ఈ కష్టాలు ఇంకెన్నాళ్లురా బాబోయ్ అనిపిస్తే ఒక్కసారి ఈ వార్త చదవండి..!

ABN , First Publish Date - 2023-04-12T13:12:36+05:30 IST

వీధి బాలలకు పునరావాసం, వసతి గృహాలలో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు.

Street Children Day: పాపం వీధి బాలలు.. ఈ కష్టాలు ఇంకెన్నాళ్లురా బాబోయ్ అనిపిస్తే ఒక్కసారి ఈ వార్త చదవండి..!
children

ప్రతి సంవత్సరం ఏప్రిల్ 12న వీధి బాలల కోసం అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. వీధిలో నివసించే పిల్లల హక్కులను విస్మరించరాదని వారి దుస్థితి గురించి అవగాహన కల్పించడానికి మానవ హక్కుల సంస్థలు, ప్రభుత్వాలు అవకాశాలను అందిస్తున్నాయి. ప్రభుత్వాలు, మానవ హక్కుల సంస్థల కేంద్రీకృత ప్రయత్నాలతో, వీధి బాలలకు పునరావాసం, ప్రేమగల గృహాలలో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ పిల్లల్ని సురక్షిత గృహాలలో చేర్చడంతో పాటు, వారికి సరైన ఆహారం, విద్యను అందించడం, వారికి వైద్య సదుపాయాలు కల్పించడం, మెరుగైన జీవనోపాధి కోసం నైపుణ్యాలను నేర్పించడం కూడా వీరి ముందున్న లక్ష్యాలు.

1989లో ఐక్యరాజ్యసమితి బాలల హక్కుల సదస్సును నిర్వహిస్తుంది. ఈ సమావేశంలో ప్రపంచంలోని పిల్లలందరికీ స్థిరమైన, ప్రేమపూర్వకమైన వాతావరణానికి సంబంధించిన హక్కులు ఉండాలని చర్చిస్తుంది. ఇందులో ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ, పోషణ; స్వచ్ఛమైన నీరు, విద్యుత్ శక్తి, సమాన అవకాశాలు, గౌరవంగా, స్వేచ్ఛతో జీవించడానికి అవసరమయ్యే వనరులను వారికి అందించాలనే ప్రతిపాదనలు చేస్తుంది.

నిజానికి వీధిలో నివసించే పిల్లలకు ఈ హక్కులు లేవు. వీధి పిల్లల కోసం కన్సార్టియం (C.S.C.) వంటి సంస్థలు వీధి బాలలు ఎదుర్కొనే ప్రమాదాలను తగ్గించడానికి సమానత్వాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ దశల్లో సమానత్వానికి కట్టుబడి ఉండటం, ప్రతి బిడ్డను రక్షించడం, సేవలకు ప్రాప్యతను అందించడం, కొత్త పరిష్కారాలను సృష్టించడం వీరి ముందున్న సవాళ్ళు.

ఇది కూడా చదవండి: డిస్ట్రోఫీ గురించి మీకేం తెలుసు? ఈ కండరాల బలహీనతకు వారసత్వ అనారోగ్యాలే కారణమట..!

ఇటీవలి గణాంకాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 150 మిలియన్ల మంది పిల్లలు వీధిలో నివసిస్తున్నారు. కొంతమంది పిల్లలు వారి కుటుంబాలతో వీధిలో నివసిస్తున్నారు, మరికొందరు ఎక్కువ సమయం ఆహారం, డబ్బు కోసం వీధిలో గడిపేవారు ఉన్నారు., కానీ రాత్రికి ఇంటికి తిరిగి వస్తారు. కొంతమంది పిల్లలు కుటుంబం లేక తిరిగి వెళ్లేందుకు ఇల్లు లేకుండా అనాథలుగా వీధిన పడుతున్నారు.

ఈ పిల్లలు వీధిన పడటానికి అనేక కారణాలు ఉన్నాయి. అత్యంత సాధారణ కారణాలలో ఒకటి నిరాదరణ, సంఘర్షణలతో జీవించడం. ఈ పరిస్థితిలలో పిల్లలు కుటుంబం నుండి వేరు చేయబడతారు లేదా కుటుంబ సభ్యులు మరణించినవారో ఇలా ఒంటరి జీవితాలను జీవిస్తారు. ఇంకొందరు పిల్లలు కుటుంబ సభ్యులు వేధింపులకు గురై కొందరు పిల్లలు స్వచ్ఛందంగా ఇంటి నుంచి వెళ్లిపోతున్నారు. ఇలా ఇతర కారణాల వల్ల వారి కుటుంబం తిరస్కరించడం, ఆరోగ్య సమస్యలు ఉండటం లేదా నేరపూరిత చర్యకు అలవాటు కావడం వంటివి ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ, వీధి బాలలకు విద్య, ఆరోగ్య సంరక్షణ, గౌరవప్రదంగా జీవించే అవకాశాలు తక్కువే.

Updated Date - 2023-04-12T13:20:12+05:30 IST