పెళ్లిళ్లు కుదిర్చే సంస్థపై విమర్శల దాడి.. ట్విట్టర్ ట్రెండ్‌లో #BoycottBharatMatrimony... పూర్తి వివరాలివే!

ABN , First Publish Date - 2023-03-09T10:36:26+05:30 IST

హోలీ సందర్భంగా మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ భారత్ మ్యాట్రిమోనీ(BharatMatrimony) విడుదల చేసిన ఒక వీడియో ప్రకటన కారణంగా ఆ సంస్థ

పెళ్లిళ్లు కుదిర్చే సంస్థపై విమర్శల దాడి.. ట్విట్టర్ ట్రెండ్‌లో #BoycottBharatMatrimony... పూర్తి వివరాలివే!

#BoycottBharatMatrimony: హోలీ సందర్భంగా మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ భారత్ మ్యాట్రిమోనీ(BharatMatrimony) విడుదల చేసిన ఒక వీడియో ప్రకటన కారణంగా ఆ సంస్థ విపరీతమైన ట్రోల్‌కు గురవుతోంది. ఈ ప్రకటన హిందువుల(Hindus) మనోభావాలను దెబ్బతీసేలా ఉందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. తాజాగా ట్విటర్‌(Twitter)లో భారత్ మ్యాట్రిమోని బాయ్‌కాట్ #BoycottBharatMatrimony ట్రెండ్ నడుస్తోంది.

వీడియోలో ఏమున్నదంటే..

"చాలామంది మహిళలను వేధింపులకు(harassment) గురిచేసే ఈ హోలీ పండుగను చేసుకోవడం మానేద్దాం. హోలీ మహిళల జీవితాన్ని ఎంత ఇబ్బందులకు గురిచేస్తోందో ఈ వీడియో(Video)లో చూడండి. రండి.. మహిళా దినోత్సవాన్ని జరుపుకుందాం, ప్రతి రోజు సురక్షితంగా ఉండే అనుభూతిని చెందుదాం’’ #BeChoosy #Holi #Holi2023 #WomensDay"

సోషల్ మీడియా(Social media)లో ట్రోల్

దీనిని చూసిన ఒక యూజర్ ఇలా ట్వీట్ చేశారు, "మీ సామాజిక అవగాహన ఎజెండా కోసం మీరు #హోలీ లాంటి హిందూ పండుగ(Hindu festival)ను ఉపయోగించుకున్నందుకు సిగ్గుపడాలి. #BoycottBharatMatrimony" మరొక యూజర్.. "ఈ హిందూఫోబిక్(Hinduphobic) వీడియోను బహిష్కరిస్తాను" అని పేర్కొన్నారు. మరొకరు "వీలైనంత త్వరగా ఈ ప్రకటన(Advertisement)ను తీసివేయండి. ...మీ సైట్ మూతపడకముందే ఆ పని చేయండి’’ అని రాశారు. కాగా భారత్ మ్యాట్రిమోనీ దీనిపై ఇంకా స్పందించలేదని తెలుస్తోంది. ఇంతకుముందు, ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ Swiggy తన ఇన్‌స్టామార్ట్(Instamart) బిల్‌బోర్డ్ ప్రకటనకు సంబంధించి ట్రోలింగ్‌కు గురయ్యింది.

ఈ ప్రకటనలో గుడ్డు(egg) ఎంతో అవసరమైన ఆహార పదార్థం, దానిని ఎవరో ఒకరి తలపై పగలగొట్టడం ద్వారా వృధా చేయవద్దు. అని పేర్కొంటూ #Buramatkhelo అనే హ్యాష్‌ట్యాగ్‌(Hashtag) తగిలించింది. కాగా భారత్ మ్యాట్రిమోనీ 5 మిలియన్ల మందికి పైగా యువతీయువకులకు వారి జీవిత భాగస్వామి(Spouse)ని ఎంపిక చేసుకోవడంలో సహాయపడింది. 2022లో ప్రపంచవ్యాప్తంగా 280 మిలియన్ సింగిల్స్ ఈ సైట్ లాగిన్ చేశారు. గత సంవత్సరం(last year) భారత్ మ్యాట్రిమోనీలో మొత్తం 4,32,520 మంది సభ్యులు తమ జీవిత భాగస్వామి(Spouse)ని ఎన్నుకున్నారని సమాచారం.

Updated Date - 2023-03-09T10:44:35+05:30 IST