Yellow Nails: చేతి గోళ్లు ఎప్పుడైనా ఇలా పచ్చగా మారిపోయాయా..? అయితే మీరు చేయాల్సిన పనేంటంటే..!
ABN , First Publish Date - 2023-07-03T15:44:14+05:30 IST
పసుపును ఏ విధంగా వాడినా దాన్ని చేత్తో తాకిన తరువాత దాని రంగు అంత సులువుగా చేతులను వదిలిపోదు..
పసుపు వంటింట్లో ప్రతి వంటకంలో తప్పనిసరిగా వినియోగించే పదార్థం. ఇక పూజలు, పండుగల సమయంలో తప్పకుండా పసుపు, కుంకుమ పూజలో భాగమవ్వాల్సిందే. పసుపును ఏ విధంగా వాడినా దాన్ని చేత్తో తాకిన తరువాత దాని రంగు అంత సులువుగా చేతులను వదిలిపోదు. భోజనం చేస్తున్నప్పుడు, తెల్లని పదార్థాలు కలుపుతున్నప్పుడు, తెల్లని వస్త్రాలు ముట్టుకున్నప్పుడు పచ్చగా పసుపు రంగు కలుస్తుంటుంది. ఇది ప్రతి మహిళకు అనుభవంలో ఉన్న విషయమే. అయితే ఇలా చేతులు పసుపుగా ఉండటం, మరీ ముఖ్యంగా చేతిగోళ్లు పచ్చగా ఉండటం కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది. చేతులకు, గోళ్ళకు ఉన్న పసుపును చిన్న చిట్కాలతో వదిలించుకోవచ్చు. ఇలా చేస్తే చేతులు సహజంగా మారిపోతాయి.
గోళ్ళ మీద పసుపు(yellow nails,) రంగు వదిలించుకోవడానికి నిమ్మకాయ బెస్ట్ ఆప్షన్. ఒక చెంచా ఆలివ్ ఆయిల్(olive oil) లో ఒక చెంచా తేనె(honey) కలపాలి. ఈ మిశ్రమాన్నిగోళ్ళపై అప్లై చేయాలి. 10నిమిషాల తరువాత నిమ్మకాయ చెక్క(half lemon) తీసుకుని గోళ్ళ మీద రుద్దాలి. పసుపు రంగు వదిలిపోవడం స్పష్టంగా కనిపిస్తుంది.
Yellow Teeth: ఎంత ప్రయత్నించినా పచ్చగా ఉన్న పళ్లు తెల్లగా మారడం లేదా..? ఇంట్లోనే తయారు చేసుకునే ఈ పేస్ట్‌ను వాడితే..!
నారింజ పండు తొక్క(orange peel) ప్రయోజనాలు ఇప్పట్లో అందరికీ తెలిసిపోయాయి. ముఖాన్ని మెరిపించడానికి ఈ నారింజ తొక్కను చాలా విరివిగా వాడుతారు. అయితే ఈ నారింజ తొక్క పొడి(orange peel powder) చేతి గోళ్ళ పసుపురంగును పోగొట్టడంలో అద్భుతంగా సహాయపడతుంది. నారింజ తొక్కల పొడిని పేస్ట్ చేసి వేలి గోళ్ళకు పట్టించాలి. ఆ తరువాత టూత్ బ్రష్ సహాయంతో సున్నితంగా రుద్దాలి. 10నిమిషాలు ఈ పేస్ట్ ను చేతిమీద అలాగే ఉంచి ఆ తరువాత కడిగేసుకోవాలి, ఇలా చేస్తే పసుపురంగు వదిలిపోతుంది.
పసుపు రంగు వదిలించుకోవడానికి బేకింగ్ సోడా(backing soda) మరొక మంచి మార్గం. బేకింగ్ సోడా, నిమ్మరసం రెండూ కలిపి పేస్టే(baking soda, lemon juice paste) చెయ్యాలి. ఈపేస్ట్ ను గోళ్ళకు పట్టించి 15నిమిషాల తరువాత వాష్ చెయ్యాలి. ఇది చాలా ప్రభావవంతమైన ఫవితాన్నిస్తుంది.