ODI World Cup 2023: టీమిండియా ఖాతాలో రెండో విజయం.. ఆప్ఘనిస్తాన్‌పై బంపర్ విక్టరీ

ABN , First Publish Date - 2023-10-11T21:12:00+05:30 IST

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఢిల్లీ వేదికగా ఆప్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానాన్ని ఆక్రమించింది.

ODI World Cup 2023: టీమిండియా ఖాతాలో రెండో విజయం.. ఆప్ఘనిస్తాన్‌పై బంపర్ విక్టరీ

వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన భారత్.. రెండో మ్యాచ్‌లో ఆప్ఘనిస్తాన్‌పై సునాయాస విజయం సాధించింది. బుధవారం నాడు ఢిల్లీ వేదికగా ఆప్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానాన్ని ఆక్రమించింది. ఆప్ఘనిస్తాన్ విధించిన 273 పరుగుల లక్ష్యాన్ని కేవలం 35 ఓవర్లలోనే టీమిండియా ఛేదించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ తొలి వికెట్‌కు 156 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ విజయం అక్కడే ఖాయమైంది. ఇషాన్ కిషన్ (47) తృటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు.

ఇది కూడా చదవండి: IND Vs AFG: సారీ చెప్పిన నవీన్ ఉల్ హక్.. చిరునవ్వులు చిందించిన కోహ్లీ

ఈ మ్యాచ్‌లో ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగాడు. 84 బాల్స్‌లో 16 ఫోర్లు, 5 సిక్సర్లతో ఆప్ఘన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇషాన్, రోహిత్ అవుటైనా.. కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ లాంఛనం పూర్తి చేశారు. విరాట్ కోహ్లీ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో 85 పరుగులు చేసిన కోహ్లీ.. ఆప్ఘనిస్తాన్‌పై అజేయంగా 55 పరుగులు చేశాడు. 56 బాల్స్‌లో 6 ఫోర్లతో అతడు 55 రన్స్ చేసి మ్యాచ్‌ను ముగించాడు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆప్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ (80), అజ్మతుల్లా ఒమర్‌జాయ్ (62) హాఫ్ సెంచరీలతో చెలరేగారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - 2023-10-11T21:12:00+05:30 IST